ఫైనల్ కు చేరిన సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి

Shuttlers Satwiksairaj Rankireddy And Chirag Shetty Reach French Open Men's Doubles Final. భారత స్టార్‌ షట్లర్లు సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి ఫ్రెంచ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ ఫైనల్‌కు దూసుకెళ్లారు.

By Medi Samrat  Published on  29 Oct 2022 12:45 PM GMT
ఫైనల్ కు చేరిన సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి

భారత స్టార్‌ షట్లర్లు సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి ఫ్రెంచ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ ఫైనల్‌కు దూసుకెళ్లారు. బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ సిరీస్‌ సూపర్‌-750 పురుషుల డబుల్స్‌ సెమీస్ లో సాత్విక్‌-చిరాగ్‌ జంట 21-18, 21-14తో దక్షిణకొరియాకు చెందిన చోయి సోల్‌ల-కిమ్‌ వోన్‌ పై గెలుపొందింది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌ తో పాటు సమీర్‌ వర్మ, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ ఓటమి పాలవగా.. ఈ టోర్నీలో భారత్‌ నుంచి సాత్విక్‌-చిరాగ్‌ జోడీ మాత్రమే పోటీలో ఉంది.

షట్లర్లు సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జంట.. 44 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో 21-18, 21-14తో కొరియన్లను ఓడించింది. చోయ్, కిమ్ నిలకడ కోసం కష్టపడుతూ ఉండగా.. చిరాగ్, సాత్విక్‌లు మొదటి నుండి ఆధిపత్యం చెలాయించారు. ఈ ఏడాది ప్రారంభంలో జనవరిలో ఇండియా ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్‌ను గెలుచుకున్న కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్లు ఇప్పుడు వారి రెండవ BWF వరల్డ్ టూర్ ఫైనల్‌లో అడుగుపెట్టారు.


Next Story
Share it