స్విగ్గీని కొనుగోలు చేయండి.. ఎలాన్ మస్క్‌ని కోరిన శుభమన్ గిల్
Shubman Gill Made A Special Request To Elon Musk.ఇటీవల ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ట్విట్టర్‌ను టెస్లా సీఈఓ
By తోట వంశీ కుమార్ Published on 30 April 2022 2:37 PM ISTఇటీవల ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ట్విట్టర్‌ను టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ట్విట్టర్ ను కొనుగోలు చేస్తానని చెప్పిన నాటి నుంచి ఓ నెల రోజుల లోపునే ఎలాన్ మస్క్ దాన్ని కొనుగోలు చేయడం దిగ్గజ సంస్థలను సైతం ఆశ్చర్యపరిచింది. ఇక ట్విట్టర్ కొనుగోలు చేసిన అనంతరం మస్క్.. మెక్ డొనాల్డ్‌ను, కోకాకోలాను సైతం కొనుగోలు చేస్తానని ట్వీట్లు చేయగా.. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
ఇదిలా ఉంటే.. ఎలాన్ మస్క్‌కు భారత యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ ఓ అభ్యర్థన పెట్టుకున్నాడు. ప్రముఖ పుడ్ డెలివరీ యాప్ స్విగ్గీనీ కొనుగోలు చేయాలని గిల్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
'ఎలాన్ మస్క్.. దయచేసి స్విగ్గీని కొనుగోలు చేయండి. అప్పుడు వారు సమయానికి పుడ్ డెలివరీ చేస్తారు ' అంటూ గిల్ ట్వీట్ చేశాడు. దీనిపై స్విగ్గీ స్పందించింది. 'హాయ్ శుభ్ మన్ గిల్.. మేం సరిచూసుకునేందుకు ఓ సారి మీ ఆర్డర్ వివరాలు పంపండి 'అని ట్వీట్ చేసింది. అనంతరం శుభ్‌మన్ వివరాలు పంపినట్లు వెల్లడించింది.
Elon musk, please buy swiggy so they can deliver on time. @elonmusk #swiggy
— Shubman Gill (@ShubmanGill) April 29, 2022
కాగా.. శుభ్‌మన్ గిల్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. నెటీజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కొందరు గిల్‌కు సపోర్టుగా కామెంట్లు చేయగా.. మరికొందరు డెలివరీ బాయ్‌గా ఒక్కరోజు పని చేసి చూస్తే ఆకష్టం తెలుస్తుందంటూ ట్వీట్ చేస్తున్నారు.
ఇక..ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరుపున శుభ్‌మన్ గిల్ ఆడుతున్నారు. ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన గిల్ 229 పరుగులు చేశాడు.