శ్రేయాస్‌ అయ్యర్‌కు భారీ షాక్‌, గాయం కాదు..వేటేనా..!

భారత్‌ వేదికగా ఇంగ్లండ్‌ టీమ్‌తో ఇండియా టెస్టు సిరీస్ ఆడుతోంది.

By Srikanth Gundamalla  Published on  10 Feb 2024 4:00 PM GMT
shreyas iyer, test cricket, team india, bcci,

శ్రేయాస్‌ అయ్యర్‌కు భారీ షాక్‌, గాయం కాదు..వేటేనా..! 

భారత్‌ వేదికగా ఇంగ్లండ్‌ టీమ్‌తో ఇండియా టెస్టు సిరీస్ ఆడుతోంది. ఐదు టెస్టు మ్యాచ్‌ సిరీస్‌లో భాగంగా ఇప్పటికే రెండు టెస్టు మ్యాచ్‌లు ముగిశాయి. తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలవగా.. రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది. ఇక మిగతా మూడు టెస్టుల కోసం ఇరు టీమ్‌లు రెడీ అవుతున్నాయి. శనివారం ఉదయమే ఇంగ్లండ్‌తో మూడో టెస్టు మ్యాచ్‌కు జట్టును ప్రకటించింది బీసీసీఐ. టీమ్‌లో శ్రేయాస్‌ అయ్యర్‌ను చేర్చుకోకపోవడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. విశాఖలో జరిగిన రెండో టెస్టులో వెన్ను నొప్పి బాధపెడుతోందీ.. సెలెక్టర్లకు ఈ విషయం అయ్యరే చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

అయితే.. గాయం కారణంగానే శ్రేయస్‌ను సెలెక్టర్లు పెట్టారని ముందుగా అనుకున్నారు. కానీ.. ఇది నిజం కాదని తెలుస్తోంది. టెస్టుల్లో కొంత కాలంగా శ్రేయస్ అయ్యర్‌ వరుసగా విఫలం అవుతూనే వచ్చాడు. బీసీసీఐ ఎన్నిసార్లు చెప్పినా మార్పు రాలేదు. దాంతో.. మిగిలిన మూడు టెస్టులకు అయ్యర్‌పై సెలెక్టర్లు వేటు వేసినట్లు తెలుస్తోంది. అంతేకాక.. ఫామ్‌ ఇదే విధంగా విఫలం అయితే ఇండియాకు టెస్టుల్లో ఆడటం కూడా కష్టమే అని అయ్యర్‌తో బీసీసీఐ అధికారులు చెప్పినట్లు జాతీయ మీడియా కథనాల్లో తెలుపుతున్నాయి.

ఇక ఇదే విషయంపై బీసీసీఐ అధికారిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. అయ్యర్‌కు ఒకవేళ గాయం అయితే బీసీసీఐ మెడికల్ బులెటిన్ విడుదల చేసేదని చెప్పారు. అతడి గాయంపై అప్‌డేట్ ఇచ్చేది కదా అన్నారు. అలా జరగలేదు కాబట్టి అర్థమేంటి.. అయ్యర్‌పై వేటు పడింది అన్నట్లు మాట్లాడారు. ఇంగ్లండ్‌తో హైదరాబాద్, విశాఖ టెస్టుల్లో దారుణంగా విఫలం అయ్యాడు. అతేకాదు.. గత 13 టెస్టు ఇన్నింగ్స్‌లో అయ్యర్‌ ప్రదర్శనను చూస్తే.. 29, 4, 12, 0, 26, 31, 6, 0, 4, 35, 13, 27, 29గా ఉంది.

Next Story