ఆసుపత్రికి శ్రేయస్ అయ్యర్

టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడటంతో..

By -  అంజి
Published on : 25 Oct 2025 9:20 PM IST

Shreyas Iyer, hip injury, hospital, Sydney

ఆసుపత్రికి శ్రేయస్ అయ్యర్  

టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడటంతో, అతడిని మెరుగైన వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో 33వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. హర్షిత్ రాణా బౌలింగ్‌లో బ్యాటర్ అలెక్స్ కేరీ క్యాచ్ ను అందుకునే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న అయ్యర్, పరిగెత్తుతూ డైవ్ చేసి అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఈ క్రమంలో కిందపడటంతో అతడి ఎడమ పక్కటెముకలకు గాయమైంది. క్యాచ్ పట్టిన వెంటనే అయ్యర్ నొప్పితో విలవిలలాడాడు. టీమ్ ఫిజియో కమలేష్ జైన్, సహచర ఆటగాళ్ల సహాయంతో అయ్యర్ మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత మళ్లీ ఫీల్డింగ్‌కు రాలేదు.

అయ్యర్ కు అయిన గాయంపై బీసీసీఐ స్పందించింది. "ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో శ్రేయస్ అయ్యర్ ఎడమ పక్కటెముకలకు గాయమైంది. గాయం తీవ్రతను అంచనా వేయడానికి అతడిని ఆసుపత్రికి తరలించాం" అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

Next Story