నన్ను క్షమించండి.. నేను సెలెక్టర్‌గా ఉంటే శ్రేయాస్ అయ్యర్‌ను అస్స‌లు ఎంపిక చేయ‌ను

దేశవాళీ క్రికెట్‌లో శ్రేయాస్ అయ్యర్ పేలవమైన ఫామ్‌పై పాకిస్థాన్ మాజీ ఆటగాడు బాసిత్ అలీ అయ్యర్ ప్రశ్నలు సంధించాడు

By Medi Samrat  Published on  14 Sept 2024 12:32 PM IST
నన్ను క్షమించండి.. నేను సెలెక్టర్‌గా ఉంటే శ్రేయాస్ అయ్యర్‌ను అస్స‌లు ఎంపిక చేయ‌ను

దేశవాళీ క్రికెట్‌లో శ్రేయాస్ అయ్యర్ పేలవమైన ఫామ్‌పై పాకిస్థాన్ మాజీ ఆటగాడు బాసిత్ అలీ అయ్యర్ ప్రశ్నలు సంధించాడు. శ్రేయాస్ అయ్యర్ అదృష్టవంతుడని బాసిత్ పేర్కొన్నాడు. అయ్యర్‌కు టెస్టు క్రికెట్‌పై ఆకలి లేదని చెప్పాడు. దులీప్ ట్రోఫీలో రహానే, ఛెతేశ్వర్ పుజారాలకు అవకాశం రాలేదని.. వ‌చ్చినా అయ్యర్ దానిని గౌరవించడం లేదని చెప్పాడు. ఓ క్రికెటర్‌గా అతడిని చూస్తుంటే బాధగా ఉంది అని బాసిత్ అన్నారు. బయటికి రావాల‌నివుంటే.. మీ దృష్టి ఆటపై ఉండదన్నాడు. ప్రపంచకప్‌లో రెండు సెంచరీలు సాధించాడు, ఐపీఎల్ గెలిచిన కెప్టెనే.. కానీ దులీప్ ట్రోఫీలో 100-200 పరుగులు చేసి ఉండాల్సింది. దులీప్ ట్రోఫీలో రహానే, పుజారా ఆడకపోవడం అయ్యర్ అదృష్టమేన‌న్నాడు. అయ్యర్‌కు టెస్టు క్రికెట్‌పై ఆకలి లేదు. అతన్ని ఇష్టపడే భారతీయులను న‌న్ను క్షమించండి.. నేను కానీ ఇండియా సెలెక్టర్‌గా ఉంటే.. అయ్యర్‌ని దులీప్ ట్రోఫీలో అస్సలు ఎంపిక చేయను. అతడు ఆటను గౌరవించడం లేదన్నాడు.

దులీప్ ట్రో రెండవ రౌండ్‌లో శ్రేయాస్ అయ్యర్‌కు ఒక ముఖ్యమైన అవకాశం లభించింది. అయినా అయ్యర్ మొదటి బంతికే ఔటయ్యాడు. ముదురు కళ్లద్దాలు పెట్టుకుని క్రీజులోకి రావడం ఆశ్చర్యకరమైన విషయం. దీంతో అయ్య‌ర్ సమస్యలు మరింత పెరిగాయి.

Next Story