ఖ‌రీదైన మెర్సిడీజ్ ఎస్‌యూవీని కొన్న శ్రేయస్ అయ్య‌ర్.. ధ‌ర ఎంతంటే

Shreyas Iyer Buys Luxury Mercedes SUV Priced At INR 2.45 Crores.టీమ్ఇండియా ఆట‌గాడు, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ కెప్టెన్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Jun 2022 2:09 PM IST
ఖ‌రీదైన మెర్సిడీజ్ ఎస్‌యూవీని కొన్న శ్రేయస్ అయ్య‌ర్.. ధ‌ర ఎంతంటే

టీమ్ఇండియా ఆట‌గాడు, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్య‌ర్ ఖ‌రీదైన కారును కొనుగోలు చేశాడు. రూ.2.55 కోట్ల ఖ‌రీదైన మెర్సీడీజ్ ఏఎంజీ జీ63 ఎస్‌యూవీని అయ్య‌ర్ సొంతం చేసుకున్నాడు. 4.0 లీట‌ర్ల వీ8 ట్విన్ ట‌ర్బో వీ8 ఇంజిన్ ఆధారంగా ప‌నిచేస్తోంది. కేవ‌లం 4.5 సెక‌న్ల‌లో ఈ ఎస్‌యూవీ వంద కిలోమీట‌ర్ల స్పీడ్‌ను అందుకుంటుంది. దీని అత్య‌ధిక వేగం గంట‌కు 240 కిలోమీట‌ర్లు. అయ్యర్‌ కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

''కంగ్రాట్స్‌ టూ టీమ్ఇండియా క్రికెటర్‌ శ్రేయాస్‌ అయ్యర్‌. అలాగే మా మెర్సిడెస్‌ బెంజ్‌ ఫ్యామిలీలోకి మీకు స్వాగతం. మెర్సిడెస్‌ బెంజ్‌లో కొత్త మోడల్‌ కారును కొనుగోలు చేసినందుకు ధన్యవాదాలు. మీ బ్యాటింగ్‌లో కవర్‌ డ్రైవ్స్‌ మేము బాగా ఎంజాయ్‌ చేస్తాం.. ఇప్పుడు మీరు మా కారు డ్రైవింగ్‌ను ఎంజాయ్‌ చేస్తారని ఆశిస్తున్నాం'' అంటూ మెర్సిడెస్‌ లగ్జరీ కార్ల కంపెనీ ట్వీట్ చేసింది.

ఇటీవ‌ల ముగిసిన ఐపీఎల్‌లో కేకేఆర్ కెప్టెన్‌గా బాధ‌త్య‌లు చేప‌ట్టిన అయ్యార్ జ‌ట్టుకు టైటిల్ అందించ‌లేక‌పోయాడు. మొత్తం 14 మ్యాచుల్లో 30.85 స‌గ‌టుతో 401 ప‌రుగులు చేశాడు. కాగా.. ఈ సీజ‌న్‌కు ముందు జ‌రిగిన మెగా వేలంలో కోల్‌క‌తా.. శ్రేయస్‌ను రూ.12.25 కోట్ల‌కు ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. సౌతాఫ్రికా సిరీస్‌కు శ్రేయాస్‌ అయ్యర్‌ ఎంపికయ్యాడు.

Next Story