పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ కారు లాహోర్‌లో ప్రమాదానికి గురైంది. పాకిస్తాన్ సూపర్ లీగ్-2021 ఎడిషన్ ప్లేయర్ డ్రాఫ్ట్‌కు హాజరై ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో నేషనల్ హై-పెర్ఫార్మెన్స్ సెంటర్ వద్ద షోయబ్ కారు ప్రమాదానికి గురైంది. పాకిస్తాన్ సూపర్ లీగ్.. ఫిబ్రవరి 20 నుండి మార్చి 22 వరకు కరాచీ, లాహోర్ వేదికగా జరుగనుంది. ఓపెనింగ్ గేమ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కరాచీ కింగ్స్.. క్వెట్టా గ్లాడియేటర్స్ తో తలపడనున్నాయి. లీగ్ సన్నాహకాలలో భాగంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పిఎస్ఎల్ 2021 కోసం ప్లేయర్ డ్రాఫ్ట్ ఏర్పాటు చేసింది.
ఈ ప్లేయర్ డ్రాఫ్ట్‌కు పెషావర్ జల్మి ఫ్రాంచైజ్ ప్రతినిధిగా షోయబ్ మాలిక్ ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. తిరుగు ప్రయాణంలో షోయబ్ మాలిక్ స్పోర్ట్స్ కారు అతివేగం కారణంగా అదుపు తప్పి.. ట్రక్కును ఢీకొట్టింది. అయితే.. ఈ ప్రమాదంలో షోయబ్ మాలిక్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
ఇదిలావుంటే.. షోయబ్ తన 21 సంవత్సరాల సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో.. 35 టెస్ట్ మ్యాచ్‌లలో 1898 పరుగులు, 32 వికెట్లతో పాటు పడగొట్టాడు. 287 వన్డే మ్యాచ్‌లలో 7534 పరుగులు, 116 టీ20లలో 2334 పరుగులు చేశాడు.