ప్రేయ‌సిని పెళ్లాడిన టీమ్ఇండియా క్రికెట‌ర్‌

Shivam Dube Gets Married to Girlfriend Anjum Khan.మ‌రో టీమ్ఇండియా క్రికెట‌ర్ ఓ ఇంటివాడ‌య్యాడు. కొంత‌కాలంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 July 2021 6:13 AM GMT
ప్రేయ‌సిని పెళ్లాడిన టీమ్ఇండియా క్రికెట‌ర్‌

మ‌రో టీమ్ఇండియా క్రికెట‌ర్ ఓ ఇంటివాడ‌య్యాడు. కొంత‌కాలంగా తాను ప్రేమిస్తున్న అమ్మాయినే ఆల్‌రౌండ‌ర్ శివం దూబే పెళ్లి చేసుకున్నాడు. శుక్ర‌వారం ముంబైలో అంజుమ్ ఖాన్‌తో దుబే వివాహం చాలా ఘ‌నంగా జ‌రిగింది. కాగా.. ఈ వివాహ వేడుక‌కు రెండు కుటుంబాల నుంచి దగ్గరి బంధువులు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. త‌న‌కు వివాహం జ‌రిగిన విష‌యాన్నిసోష‌ల్ మీడియా ద్వారా శివం దూబే వెల్ల‌డించాడు.

"ప్రేమ అనే పదం కంటే ఎక్కువగా ఇద్దరం ప్రేమించుకున్నాం. 16-07-2021న ఇద్దరం ఒక్కటయ్యాం. ఈ క్షణం నుంచి కొత్త జీవితం ప్రారంభించబోతున్నాం" అంటూ శివం దూబే ట్వీట్ చేశాడు.

ఈ క్రమంలో కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌పై అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన శివం దూబే.. 13 టీ20 మ్యాచుల్లో 105 పరుగులు చేసి 5 వికెట్లు తీసుకున్నాడు. ఫిబ్రవరి 2020లో న్యూజిలాండ్‌ సిరీస్‌లో చివరి సారిగా అంతర్జాతీయ మ్యాచ్‌లో శివం దూబే కనిపించాడు. నిల‌క‌డ‌లేమీతో చోటు కోల్పోయాడు. ఇక ఐపీఎల్‌లో అంత‌క‌ముందు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు ఆడిన దూబేను ఈఏడాది రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తీసుకుంది. ఈ సీజ‌న్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడిన శివం దూబే 145 పరుగులు చేశాడు.

ఇందులో అత్యధికంగా 46 పరుగులు చేశాడు. ఇక యూఏఈలో తిరిగి ఐపీఎల్ 2021 ప్రారంభం కానున్న నేపథ్యంలో మిగిలిన మ్యాచ్‌ల్లో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న చేసి తిరిగి టీమ్ఇండియాలో చోటు దక్కించుకోవాల‌ని గ‌ట్టి పట్టుద‌లతో ఉన్నాడు దూబే. ట్టి 632 పరుగులు చేశాడు. బ్యాటింగ్‌లో అద్బుతంగా రాణిస్తూ బంతిని బలంగా బాదడంలో దిట్ట అనే పేరును సంపాదించుకోవడంతో ముంబై డొమెస్టిక్ క్రికెట్‌లో తన స్థానంను పదిలం చేసుకున్నాడు శివం దూబే.ఇక 2019లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.5 కోట్లు వెచ్చించి ఈ ఆల్‌రౌండర్‌ను కొనుగోలు చేయడంతో ఒక్కసారిగా తన కెరీర్ మరో మలుపు తీసుకుంది. అయితే ఆ సమయంలో తాను తీసుకున్న చెక్‌కు న్యాయం చేయలేకపోయాడు ఈ యువ ఆల్‌రౌండర్.

Next Story
Share it