ధావన్ ను తక్కువ అంచనా వేస్తున్నారు సార్..!

Shikhar Dhawan's 92 helps Delhi Capitals .ధావన్ కు ఎప్పుడు డిఫెన్స్ లోకి వెళ్ళాలో.. ఎప్పుడు అటాక్ చేయాలో తెలుసు. చాలా సులువుగా రన్ రేట్ ను పెంచేయడం

By Medi Samrat  Published on  19 April 2021 3:58 AM GMT
Shikhar Dhawan

శిఖర్ ధావన్.. టీ20ల్లో కాస్త నెమ్మదిగా బ్యాటింగ్ ఆడుతాడని విమర్శలు వస్తూ ఉంటాయి. కానీ ధావన్ కు ఎప్పుడు డిఫెన్స్ లోకి వెళ్ళాలో.. ఎప్పుడు అటాక్ చేయాలో తెలుసు. చాలా సులువుగా రన్ రేట్ ను పెంచేయడం ధావన్ కు అలవాటైన పనే.. కానీ ఎందుకో చాలా మంది తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. గత ఏడాది ఐపీఎల్ సీజన్ లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో కదంతొక్కిన ధావన్ ఈ ఏడాది సీజన్ లో తొలి సెంచరీమీ జస్ట్ మిస్ చేసుకున్నాడు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 92 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు ధావన్. జె రిచర్డ్సన్ ధావన్ ను క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్ కు పంపించాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పంజాబ్ చేతుల్లో నుండి ధావన్ మ్యాచ్ ను లాగేశాడు.

పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 196 పరుగుల విజయ లక్ష్యాన్ని 10 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించిన శిఖర్ ధవన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో నాలుగు పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంది ఢిల్లీ. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు కెప్టెన్ రాహుల్, మయాంక్ అగర్వాల్ లు మంచి ఓపెనింగ్ పార్ట్నర్ షిప్ ను అందించారు. రాహుల్ 51 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 61 పరుగులు చేయగా, అగర్వాల్ 36 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 69 పరుగులు చేశాడు. గేల్ (11), పూరన్ 9 నిరాశ పరిచారు. దీపక్ హుడా (22), షారూక్ ఖాన్ (15) నాటౌట్‌గా నిలిచారు. పంజాబ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, మెరివాలా, రబడ, అవేశ్ ఖాన్‌లు చెరో వికెట్ తీసుకున్నారు.

196 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీకి శిఖర్ ధావన్, పృథ్వీ షా మంచి ఆరంభాన్ని ఇచ్చారు. కేవలం 49 బంతుల్లోనే 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 92 పరుగులు చేసి 8 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. పృథ్వీషా 32 పరుగులతో రాణించాడు. స్మిత్ 9, రిషభ్ పంత్ 15, స్టోయినిస్ 27, లలిత్ యాదవ్ 12 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో జే రిచర్డ్‌సన్ 2 వికెట్లు తీయగా, అర్షదీప్, మెరిడిత్ చెరో వికెట్ తీసుకున్నారు.


Next Story
Share it