ఆట‌గాళ్లు గాయాలు.. రెండో టెస్టుకు ముందు ఇరుజ‌ట్ల‌కు షాక్‌..!

Shardul Thakur Stuart Broad Doubtful For Lords Test After Injuries.భార‌త్ ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య తొలి టెస్టు మ్యాచ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Aug 2021 5:37 AM GMT
ఆట‌గాళ్లు గాయాలు.. రెండో టెస్టుకు ముందు ఇరుజ‌ట్ల‌కు షాక్‌..!

భార‌త్ ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య తొలి టెస్టు మ్యాచ్ ర‌స‌వ‌త్త‌రంగా సాగిన‌.. చివ‌రి రోజు వ‌రుణుడు అడ్డు ప‌డ‌డంతో మ్యాచ్ డ్రాగా ముగిసిన సంగ‌తి తెలిసిందే. తొలి టెస్టులో టీమ్ఇండియా దాదాపు విజ‌యం దిశ‌గా అడుగులు వేయ‌డంతో.. జ‌ట్టు ఆత్మ‌విశ్వాసం పెరిగింది. దీంతో అదే పోరాట ప‌టిమ‌ను రెండో టెస్టులోనూ ప్ర‌ద‌ర్శించి విజ‌యం సాధించాల‌ని త‌హ‌త‌హ‌లాడుతోంది. ఇటు ఇంగ్లాండ్ కూడా తొలి టెస్టులో చేసిన త‌ప్పుల‌ను స‌రిదిద్దుకుని రెండో టెస్టులో విజ‌యం సాధించి సిరీస్‌లో బోణి కొట్టాల‌ని బావిస్తోంది.

రేప‌టి నుంచి లార్డ్స్ వేదిక‌గా ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. అయితే.. మ్యాచ్ ప్రారంభానికి ముందే ఇరు జ‌ట్ల‌కు షాకులు త‌గిలాయి. ఇంగ్లాండ్ కీల‌క బౌల‌ర్ స్టువ‌ర్ట్ బ్రాడ్‌, టీమ్ఇండియా యువ ఆట‌గాడు శార్దుల్ గాయాల బారిన ప‌డిన‌ట్లు తెలుస్తోంది. మంగ‌ళ‌వారం ప్రాక్టీస్ చేస్తుండ‌గా.. స్టువ‌ర్ట్ బ్రాడ్ కాలి మ‌డ‌వ మ‌లుచుకుంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం అతడు లేచి నిల‌బ‌డి నడిచే ప‌రిస్థితి లేదు. దీంతో అత‌డు రెండో టెస్టుకు దూరం కానున్నాడ‌ని అంటున్నారు. కాగా.. బ్రాడ్ ఇప్ప‌టి వ‌ర‌కు 149 టెస్టులు ఆడాడు. చారిత్రాత్మ‌క లార్డ్స్ మైదానంలో 150 ఆడాల‌ని బావించిన బ్రాడ్‌కు నిరాశ త‌ప్పేట్లుగా లేదు.

ఇక శార్దూల్ ఠాకూర్ కూడా పిక్క కండ‌రాల గాయంతో బాధ‌ప‌డుతున్నాడు. ప్రాక్టీస్ చేసేట‌ప్పుడు కండ‌రాలు ప‌ట్టేశాయి. అయితే.. అత‌డి గాయంపై స్ప‌ష్ట‌మైన స‌మాచారం ఇప్ప‌టి వ‌ర‌కు అయితే లేదు. ఇక బ్రాడ్ బ‌దులు మార్క్‌వుడ్‌, శార్ధూల్ స్థానాన్ని ఇషాంత్ శ‌ర్మ భ‌ర్తీ చేసే అవ‌కాశం ఉంది.

మొయిన్ అలీకి పిలుపు..

రెండో టెస్టు కోసం ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీని ఇంగ్లాండ్‌ జట్టులోకి తీసుకున్నారు. భారత్‌తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్‌ పరుగులు సాధించడంలో విఫలమయ్యారు. అంతేకాకుండా స్టార్‌ ఆల్‌రౌండర్లు బెన్‌ స్టోక్స్, క్రిస్‌ వోక్స్‌లు సిరీస్‌కు దూరమవ్వడం ఇంగ్లాండ్‌కు సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో 'ది హండ్రెడ్‌' లీగ్‌లో రాణిస్తున్న అలీకి ఇంగ్లండ్‌ కోచ్‌ సిల్వర్‌వుడ్‌ జట్టులో స్థానం కల్పించారు.

Next Story