'నేను ఇంటికి వెళ్లను'.. వీడ్కోలు టెస్టుకు దూరంగా షకీబ్ అల్ హసన్

బంగ్లాదేశ్ వెట‌ర‌న్‌ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ తన వీడ్కోలు టెస్టు మ్యాచ్ ఆడేందుకు ఢాకాకు వెళ్ల‌లేదు

By Medi Samrat  Published on  17 Oct 2024 5:29 PM IST
నేను ఇంటికి వెళ్లను.. వీడ్కోలు టెస్టుకు దూరంగా షకీబ్ అల్ హసన్

బంగ్లాదేశ్ వెట‌ర‌న్‌ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ తన వీడ్కోలు టెస్టు మ్యాచ్ ఆడేందుకు ఢాకాకు వెళ్ల‌లేదు. ఇందుకు సంబంధించి.. తాను ఇంటికి వెళ్లనని షకీబ్ ఓ ప్రకటనలో తెలిపాడు. బుధవారం BCB దక్షిణాఫ్రికాతో జట్టును ప్రకటించింది. అందులో షకీబ్ అల్ హసన్ కూడా చోటు దక్కించుకున్నాడు. స్వదేశంలో వీడ్కోలు టెస్ట్ మ్యాచ్ ఆడాలని షకీబ్ తన కోరికను వ్యక్తం చేశాడు.

దక్షిణాఫ్రికాతో జరిగే తొలి రెండు మ్యాచ్‌లకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) జట్టును ప్రకటించడం గమనార్హం. నజ్ముల్ హసన్ శాంటో జట్టుకు నాయకత్వం వహిస్తాడు. అదే సమయంలో షకీబ్ అల్ హసన్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. స్వదేశంలో వీడ్కోలు మ్యాచ్ ఆడాలని ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ తన కోరికను వ్యక్తం చేశాడు. అయితే ఇప్పుడు అందులో ఓ ట్విస్ట్‌ వచ్చింది.. తాను బంగ్లాదేశ్ వెళ్లనని షకీబ్ అల్ హసన్ తెలిపాడు.

ESPN క్రిక్‌ఇన్‌ఫోతో మాట్లాడిన షకీబ్ అల్ హసన్.. తాను ఇంటికి వెళ్లడం లేదని ధృవీకరించారు. ఎక్కడికి వెళ్లాలో తనకు తెలియదని.. అయితే ఇంటికి వెళ్లకపోవడం దాదాపు ఖాయమని చెప్పాడు. అటువంటి పరిస్థితితుల‌లో ష‌కీబ్‌ తన చివరి టెస్ట్ ఆడుతాడా లేదా అనేది స్పష్టత లేదు. ష‌కీబ్‌కు అరెస్టు భయం పట్టుకుందని భావిస్తున్నారు. అతనిపై బంగ్లాదేశ్‌లో ప‌లు కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో చెలరేగిన హింసాకాండలో బంగ్లాదేశ్‌ మాజీ కెప్టెన్‌ మష్రఫ్‌ మొర్తజా ఇంటిని దగ్ధం చేశాడు.

షకీబ్ అల్ హసన్ స్వదేశంలో తన వీడ్కోలు మ్యాచ్ ఆడటానికి ముందు.. మాజీ ప్రధాని షేక్ హసీనాపై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైన‌ సమయంలో.. మౌనంగా ఉన్నందుకు క్షమాపణలు చెప్పడం గమనార్హం. ఇది బంగ్లాదేశ్‌లో దక్షిణాఫ్రికాతో తన చివరి టెస్ట్ ఆడటానికి మార్గం తెరిచింది. అయితే దేశానికి వెళ్లేందుకు అంగీకరించక‌పోవ‌డంతో మరోసారి ఆసక్తికర మలుపు తిరిగింది.

బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జ‌ట్ల‌ మధ్య మొదటి టెస్ట్ అక్టోబర్ 21 న ఢాకాలో జరుగుతుంది. రెండవ టెస్ట్ అక్టోబర్ 29న చిట్టగాంగ్‌లో ప్రారంభమవుతుంది. WTC25 స్టాండింగ్స్‌లో దక్షిణాఫ్రికా ఐదో స్థానంలో ఉండగా. బంగ్లా జట్టు ప్రస్తుతం ఏడో స్థానంలో ఉంది.

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకు బంగ్లాదేశ్ జట్టు

నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), షద్మాన్ ఇస్లాం, మహ్మదుల్ హసన్ జాయ్, జకీర్ హసన్, మోమినుల్ హక్ షోరబ్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్ (వికె), జకర్ అలీ అనిక్, మెహదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, నయీమ్ హసన్, తస్కిన్ ఎ. , హసన్ మెహమూద్, నహిద్ రాణా

Next Story