హ‌ద్దులు దాటిన షకీబ్ ఆగ్ర‌హాం.. వికెట్ల‌ను త‌న్ని.. నేల‌కేసి కొట్టి

Shakib Al Hasan lashes out at stumps in anger.ఎంతో అనుభ‌వం ఉన్న బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ షకీబ్ అల్ హసన్ త‌న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Jun 2021 7:50 AM GMT
హ‌ద్దులు దాటిన షకీబ్ ఆగ్ర‌హాం.. వికెట్ల‌ను త‌న్ని.. నేల‌కేసి కొట్టి

ఎంతో అనుభ‌వం ఉన్న బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ షకీబ్ అల్ హసన్ త‌న ప్ర‌వ‌ర్త‌న‌తో క్రికెట్ ప్ర‌పంచ‌మే నివ్వెర‌పోయేలా చేశాడు. అంపైర్ ఔటివ్వలేదని నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లోని వికెట్లను కాలితో తన్నాడు. అంతటితో ఆగకుండా అంపైర్‌ను దుర్భాషలాడుతూ అతనిపైకి దూసుకెళ్లాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన‌ వీడియో సోష‌ల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దీంతో క్రికెట్ విశ్లేష‌కుల‌తో పాటు క్రీడాభిమానులు అత‌నిపై తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు. అయితే.. త‌ప్పు తెలుసుకున్న ష‌కీబ్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు.

అసలేం జరిగిందంటే..!

డాకా ప్రీమియ‌ర్ లీగ్‌లో భాగంగా శుక్ర‌వారం మహ్మదాన్‌ స్పోర్టింగ్‌, అబహాని లిమిటెడ్ మ‌ధ్య టీ20 మ్యాచ్ జ‌రిగింది. మ‌హ్మ‌దాన్ కెప్టెన్ ష‌కిబ్ ఇన్నింగ్స్ అయిదో ఓవ‌ర్లో ఆఖ‌రి బంతికి ముష్భిక‌ర్ ఎల్బీ కోసం గ‌ట్టిగా అప్పీల్ చేయ‌గా.. అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించాడు. అంపైర్‌ నిర్ణయంపై క్షణాల్లో ఆవేశానికి గురైన షకీబ్‌ వికెట్లను కాళ్లతో తన్నాడు. బెయిల్స్ గాల్లో ఎగిరి ప‌డ్డాయి. అంపైర్‌తో ఔట్ అని వాగ్వాదానికి దిగాడు.

త‌రువాతి ఓవ‌ర్ ఆరో బంతికి వ‌ర్షం కార‌ణంగా అంపైర్ ఆట‌ను నిలిపి వేస్తుండ‌గా మ‌రోసారి దూసుకొచ్చిన ష‌కిబ్ మూడు వికెట్ల‌ను తీసి నేల‌కేసి కొట్టాడు. డ‌క్త్ వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో ఫ‌లితం లేలాలంటే.. క‌నిసం ఆరు ఓవ‌ర్ల పూర్తి అయి ఉండాలి. ప్రస్తుతం రెండు ఘటనలకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

అయితే షకీబ్‌ ఇలా ప్రవర్తించడం ఇది తొలిసారేమీ కాదు. గతంలోనూ అనేకసార్లు ఈ తరహా ప్రవర్తనతోనే మందలింపుకు గురయ్యాడు.

కాగా.. ఈ ఘ‌ట‌న‌పై ష‌కీబ్ క్ష‌మాప‌ణ‌లు కోరాడు. ప్రియ‌మైన అభిమానులారా, ఈ రోజు నాకోపంతో మ్యాచ్‌లో అలా ప్ర‌వ‌ర్తించినందుకు క్ష‌మాప‌ణ‌లు కోరుతున్నా. నాలాంటి అనుభ‌వ‌జ్ఞుడైన ఆట‌గాడు ఇలా చేయాల్సింది కాదు. కానీ కొన్నిసార్లు అనుకోకుండా అలా జ‌రిగిపోతుంటాయి. దానికి నేను ఎంత‌గానో చింతిస్తున్నాను. ఆయా క్రికెట్ జ‌ట్ల‌ను, టోర్నీ నిర్వాహ‌కుల‌ను, మ్యాచ్ ప‌ర్య‌వేక్ష‌కుల‌ను క్ష‌మాప‌ణ‌లు కోరుతున్నా. భ‌విష్య‌త్‌లో మ‌ళ్లీ ఇలాంటి త‌ప్పిదాలు చేయ‌న‌ని బ‌లంగా న‌మ్ముతున్నా అని ష‌కీల్ త‌న సోష‌ల్ మీడియాలో పేర్కొన్నాడు.


Next Story
Share it