అభిమానులకు క్షమాపణలు చెప్పిన షారుఖ్ ఖాన్
ShahRukh khan apologises to KKR fans.కోల్‌కతా నైట్ రైడర్స్ సహ యజమాని షారుఖ్ ఖాన్ జట్టు తగ్గ ప్రదర్శన చేయలేదని అంగీకరించాడు. అభిమానులకు క్షమాపణలు చెప్పాడు.
By తోట వంశీ కుమార్ Published on 14 April 2021 7:11 AM GMTఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్‌లో భాగంగా నిన్న రాత్రి ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఈజీగా గెలవాల్సిన కోల్‌కతా.. 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఆ జట్టుపై అభిమానులతో పాటు మాజీలు సెటైర్లు వేస్తున్నారు. కాగా.. తమ జట్టు ప్రదర్శనపై కోల్‌కతా నైట్ రైడర్స్ సహ యజమాని షారుఖ్ ఖాన్ ట్వీట్ చేశాడు. తమ జట్టు ప్రదర్శన నిరాశపరిచిందన్నాడు. నిజం చెప్పాలంటే మోర్గాన్ సేన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదని అంగీకరించాడు. అభిమానులకు క్షమాపణలు చెప్పాడు.
Disappointing performance. to say the least @KKRiders apologies to all the fans!
— Shah Rukh Khan (@iamsrk) April 13, 2021
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. సూర్యకుమార్ యాదవ్(56 36 బంతుల్లో 7పోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ( 43; 32 బంతుల్లో 3పోర్లు, 1 సిక్స్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. రసెల్(5/15), కమిన్స్(2/24) ముంబైని గట్టి దెబ్బకొట్టారు. స్వల్ప లక్షాన్ని కోల్‌కతా ఈజీగా చేదించేలా కనిపించింది. ఓపెనర్లు శుభ్ మన్ గిల్(33; 24 బంతుల్లో 5పోర్లు, 1 సిక్స్), నితీశ్ రాణా(57; 47 బంతుల్లో 6పోర్లు, 2 సిక్సర్లు) దంచి కొట్టడంతో 8.4 ఓవర్లలో 72/0 తో నిలిచింది. 15 ఓవర్లకు 122/3తో ఉంది. అప్పటి వరకు మ్యాచ్ కోల్‌కతా చేతిలోనే ఉంది. ఎవ్వరికి కూడా కోల్‌కతా విజయం పై సందేహాం లేదు. అయితే.. కేకేఆర్ ఒక్కసారిగా కుదేలు అయింది. క్రీజులో రస్సెల్, కార్తీక్ లు ఉన్నారు. ఆ సమయంలో ముంబై స్పిన్నర్ల తర్వాత బౌల్ట్, బుమ్రాలు అద్భుతంగా బౌలింగ్ చేసి కోల్‌కతా ఆశలపై నీళ్లు చల్లారు. కేకేఆర్ తన తర్వాతి మ్యాచ్ ను ఏప్రిల్ 18న చిదంబరం స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.