Viral Video : కెప్టెన్ బౌల‌ర్‌ భుజం మీద చేయి వేయకూడదా.?

రావల్పిండిలో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో పాకిస్థాన్ పై బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో సూపర్ విజయాన్ని నమోదు చేసింది.

By Medi Samrat  Published on  26 Aug 2024 5:42 PM IST
Viral Video : కెప్టెన్ బౌల‌ర్‌ భుజం మీద చేయి వేయకూడదా.?

రావల్పిండిలో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో పాకిస్థాన్ పై బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో సూపర్ విజయాన్ని నమోదు చేసింది. దీంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యుటిసి) సైకిల్‌లో తమ మొదటి మ్యాచ్‌లో విజయం సాధించాలనే పాకిస్తాన్ ఆశలు అడియాశలయ్యాయి. స్వదేశంలో లేదా విదేశాల్లో పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్‌కు ఇది తొలి టెస్టు విజయం. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0తో ఆధిక్యంలో ఉంది.

అయితే పాకిస్థాన్ జట్టులో యూనిటీ లేదని పాక్ అభిమానులు, మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. అలాంటి సన్నివేశాలే మైదానంలో కూడా బయటపడుతూ ఉన్నాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత పాక్ కెప్టెన్ షాన్ మసూద్.. స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది భుజంపై చేయి వేయగా.. అది షాహీన్ అఫ్రీది తీసేశాడు. ఇందుకు సంబంధించిన‌ వీడియో వైరల్ అయింది. ఈ వీడియ‌మో పాకిస్తాన్ క్రికెట్‌లో గొడవలు జరుగుతున్నాయనే ఊహాగానాలకు కారణమైంది. వీడియోలో షాన్ మసూద్, జట్టు కలిసి మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో షాహీన్ పక్కన నిలబడి ఉండగా.. తన భుజాల నుండి షాన్ చేతులను తీసివేసాడు. ప్రధాన కోచ్ జాసన్ గిల్లెస్పీతో షాన్ మసూద్ గొడవ పడినట్లుగా కనిపించే క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక రోజు తర్వాత ఈ వీడియో బయటకు వచ్చింది. చూస్తుంటే పాక్ జట్టులో గొడవలకు ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా కనిపించడం లేదు.

Next Story