Video : షాహీన్ అఫ్రిదీకి చుక్క‌లు చూపించిన కివీస్ బ్యాట‌ర్‌..!

మంగళవారం జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్ మరో 11 బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది.

By Medi Samrat  Published on  18 March 2025 3:16 PM IST
Video : షాహీన్ అఫ్రిదీకి చుక్క‌లు చూపించిన కివీస్ బ్యాట‌ర్‌..!

మంగళవారం జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్ మరో 11 బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ని ఇన్నింగ్స్‌కు 15 ఓవర్ల చొప్పున నిర్వహించారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 15 ఓవర్లలో 135/9 స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 13.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 22 బంతుల్లో మూడు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 45 పరుగులు చేసిన సీఫెర్ట్ న్యూజిలాండ్‌ను సులభంగా గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు.

అయితే.. షహీన్ అఫ్రిదీకి టిమ్ సీఫెర్ట్ మరిచిపోలేని బాధ‌ను మిగిల్చాడు. 30 ఏళ్ల టిమ్ సీఫెర్ట్.. ఆఫ్రిది వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో మొత్తం 26 పరుగులు చేశాడు. ఈ ఓవర్‌లో సీఫెర్ట్ నాలుగు సిక్సర్లు బాదాడు. అఫ్రిది వేగాన్ని ఏమాత్రం గౌరవించని సీఫెర్ట్.. నిరంతరాయంగా సిక్సర్లు బాదాడు.

మూడో ఓవర్‌ను టిమ్ సీఫెర్ట్ సిక్సర్‌తో ప్రారంభించాడు. అంపైర్ తలపైనుంచి లాంగ్ సిక్స్ కొట్టాడు. తర్వాతి అంటే రెండో బంతికి సీఫెర్ట్ ఎక్స్‌ట్రా కవర్‌ మీదుగా సిక్సర్ కొట్టాడు. మూడో బంతి డాట్‌గా మారింది. నాల్గవ బంతిని సీఫెర్ట్ బ్యాక్‌వర్డ్ పాయింట్ వైపు షాట్ ఆడడం ద్వారా రెండు పరుగులు చేశాడు. ఆ తర్వాత ఐదో బంతికి మిడ్ వికెట్ మీదుగా ఆకర్షణీయమైన సిక్స్. చివరి బంతికి స్క్వేర్ లెగ్ వైపు సిక్సర్ కొట్టాడు.

టిమ్ సీఫెర్ట్ తుఫాను ఇన్నింగ్స్‌తో న్యూజిలాండ్ రెండవ T20 అంతర్జాతీయ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 11 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్‌లో న్యూజిలాండ్ 2-0 ఆధిక్యంలో నిలిచింది.

మొదటి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 59 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. ఇప్పుడు ఇరు దేశాల మధ్య మూడో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ శుక్రవారం ఆక్లాండ్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని న్యూజిలాండ్ ప్రయత్నిస్తుండగా, పాకిస్థాన్ పునరాగమనం చేసి సిరీస్‌లో కొనసాగాలని కోరుకుంటుంది.

Next Story