షెఫాలీ వర్మ క్రీజు ధాటినా స్టంపౌట్ ఇవ్వలేదు.. ఎందుకంటే..?

Shafali Verma 'bizarrely' given not-out despite being outside the crease.కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళల క్రికెట్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 July 2022 10:30 AM GMT
షెఫాలీ వర్మ క్రీజు ధాటినా స్టంపౌట్ ఇవ్వలేదు.. ఎందుకంటే..?

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళల క్రికెట్ జట్టుకు శుభారంభం దక్కలేదు. ఆస్ట్రేలియాతో ఉత్కంఠ భ‌రితంగా సాగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా మూడు వికెట్ల తేడాతో ఓట‌మి చ‌విచూసింది. కాగా.. భార‌త ఇన్నింగ్స్ సంద‌ర్భంగా ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది.

భారత ఇన్నింగ్స్ సందర్భంగా 65/1 స్కోర్ సమయంలో షెఫాలీ వర్మ స్టంపౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుంది. మెగ్రాత్ బౌలింగ్ షెఫాలీ ముందుకు వ‌చ్చి భారీ షాట్ ఆడేందుకు య‌త్నించ‌గా బంతి బీట్ అయ్యి వికెట్ కీప‌ర్ అలిస్సా చేతుల్లో ప‌డింది. వెంట‌నే స్పందించిన అలిస్సా వికెట్ల‌ను గిరాటేసింది. అప్ప‌టికి షెఫాలీకి క్రీజు బ‌య‌టే ఉంది. అయిన‌ప్ప‌టికీ థ‌ర్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు.

ఎందుకంటే.. అలిస్సా బంతి ఉన్న చేతితో కాకుండా మ‌రో చేతితో స్టంపింగ్ చేయ‌డ‌మే అందుకు కార‌ణం. ఈ విష‌యాన్ని గుర్తించిన థ‌ర్డ్ అంపైర్ షెఫాలీని నాటౌట్‌గా ప్ర‌క‌టించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్లలో 8 వికెట్ల నష్టానికి 154 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (52; 34 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌), షెఫాలీ వర్మ(48; 33 బంతుల్లో 9 ఫోర్లు) లు రాణించారు. అనంత‌రం ల‌క్ష్యాన్ని ఆసీస్ 19 ఓవర్లలో 7 వికెట్లు న‌ష్ట‌పోయి చేధించింది. భార‌త బౌల‌ర్ రేణుకాసింగ్ ధాటికి 49 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డిన ఆస్ట్రేలియాను ఆష్లీ గార్డ్నెర్‌ (52 నాటౌట్), గ్రేస్‌ హ్యారీస్‌ (37) ఆదుకున్నారు. భారత బౌలర్లలో రేణుక సింగ్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా దీప్తి శర్మ రెండు, మేఘన సింగ్ ఓ వికెట్ తీశారు. ఆదివారం దాయాది పాకిస్థాన్‌తో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది.

Next Story