టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా అమ్మాయిల హవా

ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ షెఫాలీ వర్మతో పాటు ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్ రాణించారు.

By -  Medi Samrat
Published on : 30 Dec 2025 9:00 PM IST

టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా అమ్మాయిల హవా

ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ షెఫాలీ వర్మతో పాటు ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్ రాణించారు. తిరువనంతపురంలో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో షెఫాలీ 79 పరుగులతో అధ్భుత ఇన్నింగ్స్ ఆడింది. అలాగే రేణుక నాలుగు వికెట్లు తీసి శ్రీలంకకు విజయాన్ని దూరం చేసింది. దీంతో ఈ ఇద్దరికీ ర్యాంకింగ్ మెరుగ‌య్యింది. షెఫాలీ నాలుగు స్థానాలు ఎగబాకింది. ఆమె ఇప్పుడు నంబర్-6కి చేరుకుంది. మంధాన ర్యాంకింగ్‌లో మూడో స్థానంలో ఉంది.

కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు ఈ సిరీస్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం పెద్దగా రాలేదు. అందుకే ఆమె టాప్-10లో లేదు. ఆమె 15వ స్థానంలో ఉంది. టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రేణుక ఎనిమిది స్థానాలు ఎగబాకి ఏడో ర్యాంక్‌లో నిలిచింది. 14 బంతుల్లో 40 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడిన వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిచా ఘోష్ ర్యాంకింగ్‌ కూడా మెరుగైంది. ఏడు స్థానాలు ఎగబాకి 20వ స్థానానికి ఎగబాకింది. భారత్-శ్రీలంక మధ్య ఐదో, చివరి టీ20 నేడు జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ 5-0తో విజయం సాధించాలని కన్నేసింది. శ్రీలంక జట్టు విజయంతో సిరీస్‌ను ముగించాలని.. కొంత గౌరవాన్ని కాపాడుకోవడంలో విజయం సాధించాలని కోరుకుంటోంది.

Next Story