యూఎస్‌ ఓపెన్‌ నుంచి సెరెనా ఔట్‌.. షాక్‌లో ఫ్యాన్స్‌

Serena Williams withdraws from US Open.టెన్నిస్ అభిమానుల‌కు నిజంగా ఇది చేదువార్తే. టెన్నిస్ ప్రేమికులు ఎంతో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Aug 2021 6:50 AM GMT
యూఎస్‌ ఓపెన్‌ నుంచి సెరెనా ఔట్‌.. షాక్‌లో ఫ్యాన్స్‌

టెన్నిస్ అభిమానుల‌కు నిజంగా ఇది చేదువార్తే. టెన్నిస్ ప్రేమికులు ఎంతో ఆస‌క్తిక‌రంగా ఎదురుచూసే టోర్నీలో యూఎస్‌ ఓపెన్ ఒకటి. యూఎస్ ఓపెన్‌ను సొంతం చేసుకునేందుకు స్టార్ ఆట‌గాళ్లు అంతా బ‌రిలోకి దిగ‌డంతో మ్యాచ్‌లు హోరాహోరిగా జ‌రుగుతుంటాయి. అయితే.. ఈ సారి అమెరికా స్టార్ సెరెనా విలియ‌మ్స్ దూరం అవుతున్న‌ట్లు ప్ర‌కటించింది. గాయం కార‌ణంతో అందుబాటులో ఉండ‌డం లేద‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా చెప్పుకొచ్చింది. త‌న ఎడ‌మ కాలికి గాయం కావ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించింది.

కాగా..ఈ ఏడాది ఇదే చివ‌రి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ. పైగా సొంత దేశంలో జ‌రుగుతుండ‌డంతో.. ఆమెనే విజేత‌గా నిలుస్తుంద‌ని ప‌లువురు విశ్లేషించారు. అయితే.. ఆమె గాయం కార‌ణంగా దూరం అవుతుండ‌డం నిజంగా ఫ్యాన్స్‌కు షాకే అని చెప్ప‌వ‌చ్చు. త‌న‌కు ఇష్ట‌మైన న‌గ‌రం న్యూయార్క్ అని.. ఇక్కడ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ ఆడ‌టం కంటే ఇష్ట‌మైన‌ది మ‌రొక‌టి లేద‌ని సెరెనా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. యూఎస్ ఓపెన్ కు దూరమవ్వడం బాధ కల్గించే విషయ‌మ‌ని చెప్పింది. ఫ్యాన్స్ కేరింతలు మిస్ అవుతున్నందుకు బాధపడుతున్నాన‌ని.. ఫ్యాన్స్ ప్రేమ‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసింది. కాగా.. 24వ గ్రాండ్‌స్లామ్‌పై క‌న్నేసిన సెరీనాకు ఆ రికార్డు అంద‌ని ద్రాక్ష‌గా మారింది. 2017 త‌ర్వాత సెరీనా ఇప్ప‌టివ‌ర‌కు గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెల‌వ‌లేదు.

Next Story
Share it