రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ పై ఊహించని వ్యాఖ్యలు చేసిన వీరూ
Sehwag explains Rajasthan Royals in IPL. రాజస్థాన్ రాయల్స్ క్యాంపుపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేసాడు.
By Medi Samrat Published on 25 April 2021 4:43 PM ISTరాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్ గా సంజూ శాంసన్ వ్యవహరిస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! అయితే సంజూ శాంసన్ కెప్టెన్ గా అంత గొప్ప పేరు ఇప్పటికీ సంపాదించుకోలేకపోయాడు. ఇప్పటికి కేవలం రెండు విజయాలను మాత్రమే సాధించింది రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్ క్యాంపుపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేసాడు. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ కు కెప్టెన్‌గా సంజూ సామ్సన్ చేయడం పట్ల ఆ జట్ట క్యాంపులో నిరూత్సాహం అలుముకుందని.. ఆ జట్టు కలిసి కట్టుగా కనిపించడం లేదని అన్నాడు. సంజూకు కెప్టెన్సీ ఇవ్వడం నచ్చకే ఆ జట్టులోని సభ్యులు ఎవరికి వారే అన్న చందంగా వ్యవహరిస్తున్నారన్నాడు.
రాజస్థాన్ జట్టులో 11 మంది కలిసి కట్టుగా ఫీల్డ్‌లో విజయం కోసం కృషి చేయడం లేదని, వ్యక్తిగత ప్రదర్శన, వ్యక్తిగత నిర్ణయాలతో ఎవరికి వారే అన్నట్లు ఉన్నారని ప్రగ్యాన్ ఓజా కూడా చెప్పుకొచ్చాడు. సంజూ ఒకవైపు, మిగతా వారు మరొకవైపు ఉన్నారని జట్టులో సఖ్యత లేదు. సామ్సన్‌ను కెప్టెన్ చేయడం ఆర్‌ఆర్ క్యాంప్‌లో చాలామందికి ఇష్టం లేదు. అప్పటివరకూ తమతో ఉన్నవాడు సడెన్‌గా కెప్టెన్ కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని వీరూ చెప్పుకొచ్చాడు. ఒక బౌలర్ బౌలింగ్ వేస్తున్నప్పుడు అతనితో కలిసి చర్చించాలని.. బౌలర్‌పై బ్యాట్స్‌మన్‌పై ఎదురుదాడికి దిగినప్పుడు కెప్టెన్‌గా బాధ్యత ఉంటుందన్నాడు. బౌలర్ వద్దకు వెళ్లి అతన్ని కంఫర్ట్ జోన్‌లోకి తీసుకురావాలి. ఇదేమీ సంజూ శాంసన్ చేయడం లేదని.. నేను పంత్‌లో ఈ తరహా విధానం చూశాను. ఇలా చేస్తే బౌలర్‌కు ఆత్మవిశ్వాసం వస్తుందని చెప్పుకొచ్చాడు. ఆర్‌ఆర్ డగౌట్‌లోని విదేశీ ఆటగాళ్లు కూడా శాంసన్ తో సరిగా మాట్లాడుతున్నట్లు కనిపించడం లేదని వీరూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.