యువ క్రికెట‌ర్ హ‌ఠ్మార‌ణం

Saurashtra Cricketer Avi Barot passed away.ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) సీజ‌న్ విజ‌య‌వంతంగా ముగిసి, చెన్నై సూప‌ర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Oct 2021 7:11 AM GMT
యువ క్రికెట‌ర్ హ‌ఠ్మార‌ణం

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) సీజ‌న్ విజ‌య‌వంతంగా ముగిసి, చెన్నై సూప‌ర్ కింగ్స్ విజ‌యంతో సంబ‌రాల్లో మునిగి తేలుతున్న క్రికెట్ ప్ర‌పంచంలో విషాదం చోటు చేసుకుంది. యువ వికెట్ కీప‌ర్ మృతి చెందాడు. సౌరాష్ట్ర వికెట్ కీప‌ర్ క‌మ్ బ్యాట్స్‌మెన్ అయిన బ‌రోట్ శుక్ర‌వారం గుండెపోటుతో క‌న్నుమూశాడు. ఈ విష‌యాన్ని సౌరాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌(ఎస్‌సీఏ) సోష‌ల్ మీడియా ద్వారా ధ్రువీక‌రించింది. ఈ వార్త విని ప్ర‌తి ఒక్క‌రూ షాక్‌కు గురైయ్యాం అని, సౌరాష్ట్ర క్రికెట్‌లో త‌న‌కంటూ బ‌రోట్ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడ‌ని, అక్టోబ‌ర్ 15న సాయంత్రం గుండెపోటుతో మృతి చెందిన‌ట్లు ఎస్‌సీఏ ట్వీట్ చేసింది.

బ‌రోట్ కెరీర్ విష‌యానికొస్తే.. 38 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 1547, 38 లిస్ట్‌-ఏ 1030, 20 దేశవాళీ టీ20ల్లో 717 ప‌రుగులు చేశాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో గోవాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 53 బంతుల్లో 122 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు బ‌రోట్‌. 2011లో అండ‌ర్‌-19 క్రికెట్ జ‌ట్టుకు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాడు. 2019-20 సీజ‌న్‌కు గానూ రంజీ ట్రోఫి గెలిచిన జ‌ట్టులో స‌భ్యుడిగా కూడా ఉన్నాడు. బరోట్‌ ఆకస్మిక మరణం ప‌ట్ల ప‌లువురు క్రీడాకారులు సంతాపం తెలియ‌జేశారు.

Next Story
Share it