భారత స్టార్ షట్లర్లు
సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి ఈ ఏడాది తొలి టైటిల్‌ను సాధించారు. సూపర్ ఫామ్‌లో ఉన్న ఈ ఇద్దరు స్విస్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలిచారు. ఫైనల్లో చైనాకు చెందిన రెన్ గ్జియాంగ్ యూ, టన్ క్వియాంగ్ ద్వయంపై గెలుపొందారు. 54 నిమిషాలు సాగిన టైటిల్ పోరులో 21-19, 24-22తో విజయం సాధిందారు. ఇప్పటివరకు
సాత్విక్ – చిరాగ్ జంటగా ఆడి ఐదు వరల్డ్ టూర్ టైటిళ్లను గెలిచారు. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో సాత్విక్ – చిరాగ్ జోడీ మలేషియాకు చెందిన ఒంగ్ యవ్సిన్, టియో ఎఈపై 21-19 17-21 21-17 పై విజయం సాధించారు. ఇక భారత స్టార్లు పీవీ.సింధు, హెచ్ ఎస్. ప్రణయ్, కిదాంబి శ్రీకాంత్ ఈ టోర్నమెంట్ లో నిరాశపరిచారు. అయితే సాత్విక్ – చిరాగ్ జోడీ టైటిల్ నెగ్గి భారత అభిమానుల్లో చిరునవ్వును నిలిపింది.