కేకేఆర్ vs ముంబై మ్యాచ్‌.. సారా టెండూల్కర్ వ‌ర్సెస్ సుహానా ఖాన్ అన్న‌ట్టుగా ఉంది..!

Sara Tendulkar and Suhana Khan in the stands. ఆదివారం వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరిగింది.

By Medi Samrat  Published on  16 April 2023 8:15 PM IST
కేకేఆర్ vs ముంబై మ్యాచ్‌.. సారా టెండూల్కర్ వ‌ర్సెస్ సుహానా ఖాన్ అన్న‌ట్టుగా ఉంది..!

Sara Tendulkar and Suhana Khan in the stands


ఆదివారం వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా సారా టెండూల్కర్ తన సోదరుడు అర్జున్ టెండూల్కర్‌ను ప్రోత్సహిస్తూ కనిపించింది. ఆమె తన సోదరుడి మనోధైర్యాన్ని పెంచడానికి ప్రేక్షకుల గ్యాలరీలో జట్టు టీ-షర్టును ధరించి కనిపించింది. అదే సమయంలో.. సుహానా ఖాన్ కోల్‌కతా నైట్ రైడర్స్ శిబిరంలో కనిపించింది. ఆమె తన బృందాన్ని ఉత్సాహపరుస్తూ కనిపించింది.

మ్యాచ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో కెమెరామెన్ అప్పుడ‌ప్పుడు సారా, సుహానా వైపు చూపించాడు. దీంతో మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన ప్రేక్షకులు తెరపై వీరిద్దరినీ చూసి ముచ్చటపడి వారి పేర్లు పెట్టి పిలుస్తూ హల్ చల్ చేశారు. అది చూస్తే.. సారా టెండూల్కర్, సుహానా ఖాన్ మధ్య మ్యాచ్ జరుగుతున్నట్లే అనిపించింది. వీరిద్దరికి కూడా సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ తరచుగా తమ ఫోటోలు, వీడియోలను షేర్ చేసుకుంటారు. దీంతో ఇద్ద‌రిని అంత‌గా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం కూడా లేదు.

సుహానా ఖాన్ త్వరలో ది ఆర్చీస్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతోంది. సుహానా ఖాన్ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ కూడా చేసింది. ఆమె త్వరలో జోయా అక్తర్ చిత్రంలోనూ కనిపించనుంది. ఇందులో అగస్త్య నంద, ఖుషీ కపూర్ కూడా కనిపించనున్నారు. సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. శుభమాన్ గిల్‌తో ఆమె ఎఫైర్ గురించి కొన్ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే సారా అలీ ఖాన్‌తో శుభ్‌మాన్ కనిపించాక ఆ వార్త‌ల‌కు పుల్‌స్టాప్ ప‌డింది.

సుహానా ఖాన్ షారుక్ ఖాన్ కుమార్తె. సారా టెండూల్కర్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె. సచిన్ టెండూల్కర్ కూడా స్టేడియంలో కనిపించాడు. ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్‌ ఆరంగ్రేటం చేసిన‌ కొడుకు అర్జున్‌ను ప్రోత్సహించేందుకు వచ్చాడు.



Next Story