చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్‌గా డుప్లెసిస్‌..

Sanjay Bangar About CSK Captain. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2021 సీజన్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్సీని

By Medi Samrat  Published on  14 Nov 2020 2:55 AM GMT
చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్‌గా డుప్లెసిస్‌..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2021 సీజన్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్సీని డుప్లెసిస్‌కు అప్పగించి అత‌డి సార‌థ్యంలో ధోని ఆడ‌తాడ‌ని టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్ సంజ‌య్ బంగ‌ర్ అభిప్రాయప‌డ్డాడు. తాజాగా ఇర్ఫాన్‌ పఠాన్‌తో కలిసి స్టార్ స్పోర్ట్స్ 'క్రికెట్‌ కనెక్టెడ్' షోలో మాట్లాడిన బంగర్.. తర్వాతి సీజన్‌లో ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికైనా అప్పగిస్తాడా? అని అడిగిన ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చాడు. ఇక 2011 తర్వాత టీమ్ఇండియా కెప్టెన్ బాధ్య‌త‌ల నుంచి ధోని త‌ప్పుకోవాల‌ని బావించి ఉంటాడ‌ని.. అయితే ఆస‌మ‌యంలో స‌రైన వ్య‌క్తి లేక‌పోవ‌డంతో కొన్నాళ్ల పాటు టీమ్ ను న‌డిపించాడ‌ని అన్నారు. సరైన సమయంలో కోహ్లీకి కెప్టెన్సీ అప్పగించి అతడి సారథ్యంలో ఆడినట్లు గుర్తుచేశాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లోనూ వచ్చే ఏడాది డుప్లెసిస్‌కు బాధ్యతలు అప్పగించి సాధారణ ఆటగాడిగా కొనసాగే అవకాశం ఉందన్నాడు.

అంతకుముందు ఇర్ఫాన్ పఠాన్‌ స్పందిస్తూ.. ఇప్పటికైతే తానేమీ అలాంటివి ఊహించడం లేదని స్పష్టం చేశాడు. 'నాకైతే అలాంటి ఆటగాళ్లెవరూ కనిపించడం లేదు. తర్వాతి సీజన్‌కు మరికొద్ది నెలల సమయమే ఉండడంతో ధోనీ పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌తో తిరిగొస్తాడని భావిస్తున్నా. ఐపీఎల్‌ కన్నా ముందే పలు మ్యాచ్‌లు ఆడుతాడని ఆశిస్తున్నా. ఎందుకంటే ఏ ఆటగాడికైనా అదెంతో అవసరం. ధోనీ గొప్ప ఆటగాడు కాబట్టి అతన్ని మళ్లీ చూడాలనుకుంటున్నా' అని ఇర్ఫాన్‌ పేర్కొన్నాడు.

ఐపీఎల్ 2020 సీజ‌న్‌లో చెన్నై జ‌ట్టు మునుపెన్న‌డూ లేని విధంగా ఘోరంగా విఫ‌ల‌మైంది. టోర్నీ చ‌రిత్ర‌లోనే తొలిసారి ప్లే ఆఫ్ చేర‌కుండానే నిష్క్ర‌మించింది. కాగా.. చెన్నై జ‌ట్టుకు ధోని మూడు టైటిల్స్ అందించిన సంగ‌తి తెలిసిందే. ఈ సీజ‌న్ ముగిసిన అనంత‌రం వ‌చ్చే సీజ‌న్‌లో కూడా ధోని సార‌థ్యంలోనే చెన్నై జ‌ట్టు ఆడ‌నుంద‌ని ఆ ఫ్రాంచైజీ సీఈఓ చెప్పిన విష‌యం తెలిసిందే.


Next Story