చివ‌రి గ్రాండ్ స్లామ్‌లో త‌ప్ప‌ని నిరాశ‌.. క‌న్నీళ్లు పెట్టుకున్న సానియా

Sania Mirza-Rohan Bopanna lose Australian Open mixed doubles title.చివ‌రి గ్రాండ్ స్లామ్ టోర్నీ ఆడుతున్న సానియా మీర్జాకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Jan 2023 10:48 AM IST
చివ‌రి గ్రాండ్ స్లామ్‌లో త‌ప్ప‌ని నిరాశ‌.. క‌న్నీళ్లు పెట్టుకున్న సానియా

కెరీర్‌లో చివ‌రి గ్రాండ్ స్లామ్ టోర్నీ ఆడుతున్న సానియా మీర్జాకు నిరాశ త‌ప్ప‌లేదు. రోహ‌న్ బొప్ప‌న్న‌తో క‌లిసి ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ మిక్స్‌డ్ డ‌బుల్స్‌లో బ‌రిలోకి దిగిన సానియా ఫైన‌ల్స్‌లో ఓడిపోయింది. దీంతో ర‌న్న‌ర‌ప్ ట్రోఫీతో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. శుక్ర‌వారం మెల్‌బోర్న్‌లోని రాడ్ లేవ‌ర్ ఎరీనాలో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో సానియా మీర్జా-రోహ‌న్ బోప‌న్న జోడి బ్రెజిల్ జంట స్టెఫాని-ర‌ఫెల్ చేతిలో 6-7, 2-6 తేడాతో ఓట‌మి పాలైంది.

తొలి సెట్‌లో హోరా హోరీ పోరు జ‌రిగింది. ఓ ద‌శ‌లో 3-2 ఆధిక్యంలో నిలిచింది సానియా-రోహ‌న్ జోడి. అయితే ఆ త‌రువాత త‌డ‌బ‌డ‌డంతో ప్ర‌త్య‌ర్థి ఆట‌గాళ్లు పుంజుకోవ‌డంతో సెట్ ట్రై బ్రేక్ దారి తీసింది. మంచి ప్ర‌ద‌ర్శ‌న చేయ‌క‌పోవ‌డంతో తొలి సెట్‌ను కోల్పోయింది సానియా జోడి. రెండో సెట్‌లో బ్రెజిల్ జంట సానియా జోడికి ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌లేదు. దీంతో ఓట‌మితో సానియా త‌న గ్రాండ్ స్లామ్ టెన్నిస్ కెరీర్ వీడ్కోలు ప‌ల‌కాల్సి వ‌చ్చింది.

ఇక మ్యాచ్ మెగిసిన త‌రువాత సానియా మాట్లాడుతూ భావోద్వేగానికి లోనైంది. క‌న్నీళ్లు పెట్టుకుంది. 2005లో ఆస్ట్రేలియన్ ఓపెన్ తో సానియా గ్రాండ్ స్లామ్ అరంగేట్రం చేసింది. ఇక త‌న కొడుకు స‌మ‌క్షంలో గ్రాండ్ స్లామ్ ఫైన‌ల్ ఆడుతాన‌ని ఏనాడు తాను ఊహించ‌లేద‌ని చెప్పింది.

ఫిబ్ర‌వ‌రిలో దుబాయ్ వేదిక‌గా జ‌రిగే డబ్ల్యూటీఏ 1000 ఈవెంట్ తో సానియా మీర్జా టెన్నిస్ కెరీర్ ముగియ‌నుంది.

Next Story