సానియా మీర్జా తండ్రి చెప్పింది ఇదే!!

ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి, పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షోయిబ్‌ మాలిక్

By Medi Samrat  Published on  20 Jan 2024 12:56 PM GMT
సానియా మీర్జా తండ్రి చెప్పింది ఇదే!!

ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి, పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షోయిబ్‌ మాలిక్ విడిపోయారు. పాకిస్తాన్‌ నటి సనా మాలిక్‌ను షోయిబ్‌ మాలిక్‌ పెళ్లి చేసుకున్నారు. తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలను షోయిబ్‌ మాలిక్ ఇన్‌స్టాలో పోస్టు చేశారు. కొంత కాలం క్రితం.. విడాకులు, వివాహానికి సంబంధించిన సానియా మీర్జా తన ఇన్‌స్టా ఓ పోస్ట్‌ షేర్‌ చేసింది.. "వివాహం కష్టం.. విడాకులు తీసుకోవడం కష్టం.. మీ కష్టమైన మార్గాన్ని ఎంచుకోండి.." అని చెప్తూ పోస్ట్‌ చేసింది. దీంతో వీరి విడాకులు కన్ఫాం అయినట్లేనని అప్పట్లో చర్చ జరిగింది. తాజాగా తన పెళ్లి ఫొటోలను స్వయంగా షోయిబ్‌ ఇన్‌స్టాలో పెట్టడంతో ఇక వీరి వైవాహిక జీవితం ముగిసింది.

వీటిపై సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పష్టతనిచ్చారు. తన కుమార్తె సానియా 'ఖులా' (విడాకులు) ను ఎంచుకుందని వెల్లడించారు. సానియా మీర్జా, షోయబ్ మాలిక్ ఇద్దరూ విడిపోవడానికి సంబంధించిన ఊహాగానాల గురించి పెదవి విప్పకుండా ఉన్నారు. వారి వ్యక్తిగత విషయాలను దాచేశారు. ఇస్లాం సంప్రదాయం ప్రకారం ముస్లిం మహిళలు భర్త సమ్మతితో పని లేకుండా అతడి నుంచి విడిపోవడాన్ని 'ఖులా' అంటారు. దాన్నే సానియా తండ్రి చెప్పారు. ముస్లిం మహిళలకు ఆ మేరకు ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే హక్కు ఖులా ఇస్తుంది. ఇప్పుడు సానియా కూడా ఈ మార్గాన్నే ఎంచుకున్నట్టు ఆమె తండ్రి మాటల ద్వారా అర్థమవుతోంది. 2010 ఏప్రిల్ 12న పాకిస్థాన్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ ను పెళ్లాడింది. వీరికి ఇజాన్ మీర్జా మాలిక్ అనే కుమారుడు ఉన్నాడు.


Next Story