సానియా మీర్జా సంచలన నిర్ణయం.. ఇదే నా చివ‌రి టోర్న‌మెంట్‌

Sania Mirza announces retirement plans.భార‌త టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అభిమానుల‌కు షాకిచ్చింది. టెన్నిస్‌కి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Jan 2022 3:14 PM IST
సానియా మీర్జా సంచలన నిర్ణయం.. ఇదే నా చివ‌రి టోర్న‌మెంట్‌

భార‌త టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అభిమానుల‌కు షాకిచ్చింది. టెన్నిస్‌కి తాను గుడ్ బై చెప్పనున్న‌ట్లు వెల్ల‌డించింది. 2022 సీజ‌న్ త‌న‌కు చివ‌రిద‌ని సానియా మీర్జా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఓట‌మి త‌రువాత సానియా స్వ‌యంగా ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది.

ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఉక్రెయిన్ భాగ‌స్వామి న‌దియా కిచ్నోక్‌తో క‌లిసి బ‌రిలోకి దిగిన సానియా.. స్లోవేనియాకు చెందిన తమరా జిదాన్‌సెక్‌-కాజా జువాన్‌ జోడీ చేతిలో 4-6, 6-7(5) తేడాతో ప‌రాజ‌యం పాలైంది. ఓట‌మి అనంత‌రం సానియా మాట్లాడుతూ..'ఇది నా చివరి సీజన్ అని నేను నిర్ణయించుకున్నాను. నేను ఒక వారం నుంచి ఇందులో ఆడుతున్నాను. నేను మొత్తం సీజన్‌లో ఆడగలనో లేదో తెలియదు. కానీ, నేను మొత్తం సీజన్‌లో ఉండాలనుకుంటున్నాను' అంటూ సానియా చెప్పింది. కాగా.. మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా అమెరికాకు చెందిన రాజీవ్ రామ్‌తో క‌లిసి బ‌రిలోకి దిగ‌నుంది.

సానియా మీర్జా త‌న కెరీర్‌లో ఆరు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచింది. వీటిలో మూడు టైటిల్స్ మహిళల డబుల్స్ కాగా.. మ‌రో మూడు మిక్స్‌డ్ డబుల్స్‌లో సాధించింది. 2003 నుంచి ఆడుతున్న సానియా 2013 నుంచి సింగిల్స్ ఆడ‌డం మానేసింది. అప్పటి నుంచి ఆమె డ‌బుల్స్ మాత్ర‌మే ఆడుతోంది. సింగిల్స్ ఆడేట‌ప్పుడు ఎంతో మంది గొప్ప క్రీడాకారుల‌కు సానియా ఓడించింది. సింగిల్స్‌లోఆమె కెరీర్ బెస్ట్ ర్యాంకు 27 కావ‌డం గ‌మ‌నార్హం.

Next Story