ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌కు చేరిన సానియా జోడీ
Sania-Bopanna In Australian Open Mixed Doubles Final. కెరీర్‌లో చివరి గ్రాండ్ స్లామ్ టోర్నీ ఆడుతున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆస్ట్రేలియా ఓపెన్
By Medi Samrat Published on
25 Jan 2023 4:00 PM GMT

కెరీర్‌లో చివరి గ్రాండ్ స్లామ్ టోర్నీ ఆడుతున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆస్ట్రేలియా ఓపెన్ 2023 టోర్నీ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. భారత స్టార్ రోహన్ బోపన్నతో జతకట్టిన సానియా మీర్జా బుధవారం జరిగిన సెమీఫైనల్లో మూడో సీడ్ నీల్ సుపాస్కి(గ్రేట్ బ్రిటన్), డిసిరే క్రాజెక్(అమెరికా) ధ్వయాన్ని ఓడించింది. హోరాహోరిగా సాగిన ఈ మ్యాచ్‌లో సానియా-బోపన్న జోడీ 7-6, 6-7, 10-6 తేడాతో నీల్-క్రాజెక్ ద్వయాన్ని ఓడించింది.
క్వార్టర్స్‌లో ప్రత్యర్థి జోడీ ఒస్టాపెంకో (లాత్వియా)-వెగా హెర్నాండెజ్ (స్పెయిన్) వాకోవర్ ఇవ్వడంతో సానియా ద్వయం సెమీస్‌లో అడుగుపెట్టింది. ఇప్పుడు సెమీస్‌లో సూపర్ విక్టరీ అందుకుని సానియా-బోపన్న జోడీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఫిబ్రవరిలో దుబాయ్ వేదికగా జరిగే డబ్ల్యూటీఏ 1000 టోర్నీతో టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతానని 36 ఏళ్ల సానియా మీర్జా ఇటీవలే ప్రకటించింది.
Next Story