అడ్డుకున్నాడు.. ఔటైయ్యాడు

Sam Harper given out obstructing the field.క్రికెట్ అంటే జెంటిల్‌మ‌న్ గేమ్ అని అంటారు. అయితే.. ఇటీవ‌ల జ‌రుగుతున్న కొన్ని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 April 2021 11:02 AM GMT
Sam Harper

క్రికెట్ అంటే జెంటిల్‌మ‌న్ గేమ్ అని అంటారు. అయితే.. ఇటీవ‌ల జ‌రుగుతున్న కొన్ని సంఘ‌ట‌న‌లు జెంటిల్‌మ‌న్ అన్న ప‌దానికే మ‌చ్చ‌తెచ్చేలా ఉన్నాయి. మొన్న‌నే డ‌బుల్ సెంచ‌రీకి చేరువ‌లో ఉన్న పాక్ బ్యాట్స్‌మెన్ ఫ‌కార్ జ‌మాన్‌(193) ర‌నౌట్‌కు సౌతాఫ్రికా వికెట్ కీప‌ర్ క్వింట‌న్ డికాక్ కార‌మైన సంఘ‌ట‌న‌ను మ‌రువ‌క ముందే నేడు మార్ష్ క‌ప్ టోర్నీలో సామ్ హార్ప‌ర్ చేసి ప‌ని ఇప్పుడు క్రికెట్‌లో చ‌ర్చ‌నీయాంశం అయింది. ప్ర‌స్తుతం సిడ్ని వేదిక‌గా మార్ష‌క‌ప్ టోర్నీ జ‌రుగుతోంది. సౌత్ ఆస్ట్రేలియా, విక్టోరియా జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది.

విక్టోరియా జ‌ట్టు బ్యాటింగ్ కు దిగింది. ఈక్ర‌మంలో సౌత్ ఆస్ట్రేలియా బౌల‌ర్ వార‌ల్ బౌలింగ్ చేయ‌గా.. విక్టోరియా ఓపెన‌ర్ సామ్ హార్ప‌ర్ బంతిని కొట్టాడు. అయితే.. ఆ బంతి నేరుగా బౌల‌ర్ ద‌గ్గ‌రికే వెళ్ల‌డంతో అత‌డు ఆ బంతిని ప‌ట్టుకున్నాడు. వెంట‌నే స్ట్రైకింగ్ ఎండ్‌లో బంతిని వికెట్ల‌పైకి విసిరాడు. ఆ స‌మ‌యంలో సామ్ హార్ప‌ర్ క్రీజు బ‌య‌ట ఉన్నాడు. అయితే.. బౌల‌ర్ విసిరిన బంతి వికెట్ల‌ను త‌గులుతుంద‌ని గ్ర‌హించిన సామ్‌.. వెంట‌నే క్రీజులోకి వెళ్ల‌కుండా బంతిని కాళ్ల‌తో అడ్డుకున్నాడు. దీంతో డేనియ‌ల్ వార‌ల్ తీవ్ర అస‌హానం వ్య‌క్తం చేయ‌డంతో పాటు అంపైర్ల‌కు ఫిర్యాదు చేశాడు.

దీనిపై చ‌ర్చించిన ఆన్‌-ఫీల్డ్ అంపైర్లు థ‌ర్ఢ్ అంపైర్‌కు అప్పీల్ చేశారు. వీడియోను ప‌లుమార్లు ప‌రిశీలించిన థ‌ర్డ్ అంపైర్‌.. సామ్ హార్ప‌ర్ కావాల‌నే బంతిని అడ్డుకున్న‌ట్లు గుర్తించి ఐసీసీ నిబంధ‌న‌ల ప్ర‌కారం అబ్‌స్ట్రాటింగ్ ది పీల్డ్‌గా ప‌రిగ‌నించి ఔట్ గా ప్ర‌క‌టించాడు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. బ్యాట్స్‌‌మెన్ సామ్ పై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇంకెందుకు ఆల‌స్యం మీరు ఓ సారి వీడియోను చూసేయండి.


Next Story
Share it