వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియ నిర్వహిస్తున్నారు. కేరళలోని కొచ్చిలో కొద్దిసేపటి కిందట వేలం ప్రారంభమైంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ మినీ వేలంలో ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ ను రూ.13.25 కోట్లకు సన్ రైజర్స్ సొంతం చేసుకుంది. మయాంక్ అగర్వాల్ ను రూ.8.25 కోట్లకు కొనుగోలు చేసింది. సన్ రైజర్స్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ను రూ.2 కోట్లకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. అజింక్యా రహానేను రూ.50 లక్షలకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. జాసన్ హోల్డర్ ను రాజస్థాన్ రాయల్స్ 5.75 కోట్లకు కొనుగోలు చేసింది.
ఇక ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ ను పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ రూ. 18.50 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా సామ్ కరన్ కొత్త చరిత్ర సృష్టించాడు. దక్షిణాఫ్రికాకు చెందిన ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ ఐపీఎల్ 2021 మినీ వేలంలో రాజస్తాన్ రాయల్స్ రూ. 16.25 కోట్లకు కొనుగోలు చేయడం రికార్డుగా ఉంది. తాజాగా ఆ రికార్డును సామ్ కరన్ బద్దలుకొట్టాడు. బెన్ స్టోక్స్ ను రూ.16.25 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది.