సల్మాన్ ఖాన్‌తో బాక్సర్ నిఖత్ జరీన్ డ్యాన్స్.. వీడియో వైరల్
Salman Khan Dances To His Iconic Song With Boxer Nikhat Zareen. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్.. తాజాగా తన అభిమాన నటుడు, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్
By అంజి Published on 9 Nov 2022 11:55 AM ISTప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్.. తాజాగా తన అభిమాన నటుడు, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను కలుసుకుంది. ఈ సందర్భంగా సల్మాన్‌ఖాన్‌తో కలిసి నిఖత్ స్టెప్పులేసి తన కలను నిజం చేసుకుంది. సల్మాన్‌ను కలిసి తన ఫ్యాన్‌మూమెంట్‌ను తీర్చుకుంది. సల్మాన్ ఖాన్ 'లవ్' సినిమాలోని సూపర్‌హిట్ పాట ' సాథియా తూనే క్యా కియా'కు ఇద్దరూ స్టెప్పులేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిఖత్ ట్విటర్‌లో షేర్ చేసిన ఈ వీడియోతో చివరిగా నిరీక్షణ ముగిసిందని క్యాప్షన్ రాస్తూ.. 'డ్రీమ్ కమ్ ట్రూ' అనే హ్యాష్‌ట్యాగ్ పెట్టింది.
Finallyyyyy intezar khatam hua❤️@BeingSalmanKhan #fanmoment#dreamcometrue#salmankhan pic.twitter.com/pMTLDqoOno
— Nikhat Zareen (@nikhat_zareen) November 8, 2022
వీడియోలో, సల్మాన్ ఖాన్ నల్లటి ప్యాంట్‌తో జత చేసిన తెల్లటి చొక్కాతో కనిపిస్తుండగా, నిఖత్ బ్లూ అథ్లెజర్‌లో చూడవచ్చు. ఆమె వీడియోను షేర్ చేసిన వెంటనే అభిమానులు కామెంట్ సెక్షన్‌ను ముంచెత్తారు. ఒక అభిమాని ఇలా వ్రాశాడు.. ''ప్తా నహీ (నాకు తెలియదు) కానీ ఈ పాటలో భాయ్ డ్యాన్స్ చేయడం చూసి నేను భావోద్వేగానికి లోనయ్యాను. లవ్ యూ భాయ్.ఈ హృదయపూర్వక, మంచి అనుభూతిని కలిగించినందుకు ధన్యవాదాలు'' అని పేర్కొన్నాడు. మరొకరు "చాలా అభినందనలు. చివరగా మీరు అతన్ని కలుసుకున్నారు.'' అని కామెంట్ చేశారు.
ఒలింపిక్స్ మెడల్ సాధించడం తన కల అని, అది నేరవేరాక స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌ను నేరుగా కలవాలనేది తన కోరికని నిఖత్ గతంలో ట్వీట్ చేసింది. ఈ ఏడాది మేలో జరిగిన మహిళల ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు బంగారు పతకాన్ని నిఖత్ అందించారు. నిఖత్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ అయ్యాక.. ఆమెను అభినందిస్తూ సల్మాన్ ట్వీట్ చేశాడు. బాలీవుడ్‌లో 1991లో 'లవ్' సినిమా వచ్చింది. సల్మాన్ ఖాన్, రేవతి జంటగా నటించారు. ఈ మూవీ 1989లో తెలుగులో వచ్చిన 'ప్రేమ' మూవీకి హిందీ రీమేక్.