'అతడే మా ట్రంప్ కార్డ్'.. టీమిండియాతో మ్యాచ్‌కు ముందు పాక్ కెప్టెన్ చెబుతుంది ఇదే..!

భారత జట్టు ఆదివారం కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో పాకిస్థాన్‌తో తలపడనుంది

By -  Medi Samrat
Published on : 14 Feb 2026 4:20 PM IST

అతడే మా ట్రంప్ కార్డ్.. టీమిండియాతో మ్యాచ్‌కు ముందు పాక్ కెప్టెన్ చెబుతుంది ఇదే..!

భారత జట్టు ఆదివారం కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ అద్భుత పోరు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వర్షం మ్యాచ్‌ను ప్రభావితం చేసే అవ‌కాశం ఉంది. ఇంతలో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా.. ఈ మ్యాచ్‌లో ఏ ఆటగాడు ట్రంప్ కార్డో వెల్లడించాడు.

ఉస్మాన్ తారిఖ్ కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) క్లీన్ చిట్ ఇచ్చిందని పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ సల్మాన్ అలీ అఘా అన్నారు. ఆదివారం జరిగే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు ముందు అతని గురించి జరుగుతున్న ఊహాగానాలు అతనిపై ఎలాంటి ప్రభావం చూపవు. ఉస్మాన్ నాలుగు టి20 అంతర్జాతీయ మ్యాచ్ లలో 7.90 సగటుతో 11 వికెట్లు పడగొట్టాడు.

"మీరందరూ ఉస్మాన్ తారిక్‌కు పెద్ద పేరు తెచ్చిపెట్టారు. 15 మంది ఆటగాళ్లూ మాకు ముఖ్యమైనవారే. అతను బాగా బౌలింగ్ చేస్తున్నాడు. అతను మా ట్రంప్ కార్డ్ అని మేము ఖచ్చితంగా చెప్పగలం" అని ఆఘా అన్నారు. అతనికి ఐసీసీ క్లీన్ చిట్ ఇచ్చింది. కాబట్టి అందరూ ఇంకా అతని గురించి ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఉస్మాన్ ఈ విషయాల వల్ల ప్రభావితం కాడు. అతను బాగానే ఉన్నాడు. అతను ఈ విషయాలను పట్టించుకోడు.

భారత్‌పై పాకిస్తాన్ పేలవమైన రికార్డును సల్మాన్ అలీ అఘా అంగీకరించాడు. కానీ ప్రతి రోజు కొత్త రోజు ఏమైనా జ‌ర‌గొచ్చు.. గత ఫలితాలను మార్చలేమని అన్నాడు. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో భారత్, పాకిస్తాన్ ఎనిమిది సార్లు తలపడగా, పాకిస్తాన్ ఒకే ఒక్క మ్యాచ్‌లో గెలిచింది.

"భారతీయులతో పోలిస్తే మాకు మంచి రికార్డు లేదు, కానీ మనం చరిత్రను మార్చలేము. ప్రతి రోజూ కొత్త రోజే" అని అగా అన్నారు. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు భారత్‌, పాకిస్తాన్ చెరో రెండు మ్యాచ్‌లు ఆడాయి. రెండూ ఆ మ్యాచ్‌లలో గెలిచాయి. భారత్‌, అమెరికా, నమీబియాను ఓడించగా, పాకిస్తాన్.. నెదర్లాండ్స్, అమెరికాను ఓడించింది.

సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు నాలుగు పాయింట్లు, +3.050 నెట్ రన్ రేట్‌తో గ్రూప్ A లో అగ్రస్థానంలో ఉంది. పాకిస్తాన్ నాలుగు పాయింట్లు, +0.932 నెట్ రన్ రేట్ తో రెండవ స్థానంలో ఉంది.

Next Story