కరేబియన్ ప్రీమియర్ లీగ్.. టైటిల్ నెగ్గిన సెయింట్ లూసియా కింగ్స్

గయానా అమెజాన్ వారియర్స్ (GAW) vs సెయింట్ లూసియా కింగ్స్ (SLK) మధ్య కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 7 (శనివారం) గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో జరిగింది.

By అంజి  Published on  7 Oct 2024 9:00 AM IST
Saint Lucia Kings, CPL 2024, Caribbean Premier League, Guyana Amazon Warriors

కరేబియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ నెగ్గిన సెయింట్ లూసియా కింగ్స్

గయానా అమెజాన్ వారియర్స్ (GAW) vs సెయింట్ లూసియా కింగ్స్ (SLK) మధ్య కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 7 (శనివారం) గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో జరిగింది. గయానా అమెజాన్ వారియర్స్ (GAW)కి ఇమ్రాన్ తాహిర్ నాయకత్వం వహిస్తుండగా.. సెయింట్ లూసియా కింగ్స్ (SLK)కి ఫాఫ్ డు ప్లెసిస్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో గెలిచి సెయింట్ లూసియా కింగ్స్ మొదటి CPL టైటిల్‌ను గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో సెయింట్ లూసియా కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన గయానా అమెజాన్ వారియర్స్ 20 ఓవ‌ర్ల‌లో 138 ప‌రుగులు చేసింది.

హోప్‌(22), ఫ్రిటోరియ‌స్‌(24) చెప్పుకోద‌గ్గ ప‌రుగులు చేయ‌డంతో గయానా అమెజాన్ వారియర్స్ ఈ మాత్రం స్కోరు చేసింది. మిగ‌తా బ్యాట్స్‌మెన్ అంత ప‌రుగులు చేయ‌డానికి తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు. సెయింట్ లూసియా బౌల‌ర్ల‌లో నూర్ అహ్మ‌ద్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. పెర్రీ, పోర్డ్‌, జోస‌ప్‌, చేజ్‌, వీస్ త‌లా ఒక్క వికెట్ తీశారు. అనంత‌రం చేధ‌న‌కు దిగిన సెయింట్ లూసియా కింగ్స్ 18.1 ఓవ‌ర్ల‌లో ల‌క్ష్యాన్ని చేధించింది. ఫాఫ్ డు ప్లెసిస్(21), రోస్ట‌న్ చేజ్‌(39), ఆరోన్ జోన్స్‌(48) ప‌రుగుల‌తో రాణించారు. దీంతో సెయింట్ లూసియా కింగ్స్ మొదటి CPL టైటిల్‌ను గెలుచుకుంది.

Next Story