స‌చిన్ టెండూల్కర్ కు క‌రోనా.. స్వ‌యంగా వెల్ల‌డించిన క్రికెట్ దిగ్గ‌జం

Sachin tendulkar tests positive for covid 19.దేశ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. సామాన్యులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 March 2021 5:20 AM GMT
స‌చిన్ టెండూల్కర్ కు క‌రోనా.. స్వ‌యంగా వెల్ల‌డించిన క్రికెట్ దిగ్గ‌జం

దేశ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. సామాన్యులు, సెల‌బ్రెటీలు అన్న తేడాలేకుండా అంద‌రూ ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నారు. తాజాగా క్రికెట్ దిగ్గజం, మాస్ట‌ర్‌ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయ్యింది. తాజాగా నిర్వ‌హించిన క‌రోనా ప‌రీక్ష‌ల్లో స‌చిన్‌కు పాజిటివ్ గా తేలింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా స‌చిన్ త‌న సోష‌ల్ మీడియాలో ద్వారా వెల్లడించారు.

'కరోనా సోకుకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ ఎప్పటికప్పుడు కరోనా పరీక్షలు చేయించుకుంటున్నాను. తాజాగా చేయించుకున్న పరీక్షలో నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా లక్షణాలు చాలా స్వల్పంగా ఉన్నాయి. మా ఇంట్లో మిగిలిన అందరికీ నెగిటివ్ వచ్చింది. నేను ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంటూ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాను. నాకు మద్దతుగా నిలుస్తున్న వైద్య సిబ్బందికి, దేశవ్యాప్తంగా ఉన్న నా శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. అందరూ జాగ్రత్తగా ఉండండ`ని సచిన్ ట్వీట్ చేశాడు.


Next Story
Share it