ఆస్ప‌త్రిలో చేరిన స‌చిన్ టెండూల్క‌ర్

Sachin tendulkar hospitalized. స‌చిన్ టెండూల్క‌ర్ వెద్యుల స‌ల‌హా మేర‌కు తగిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఆస్ప‌త్రిలో చేరిన‌ట్లు ట్వీట్ చేశారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 April 2021 11:56 AM IST
Sachin tendulkar hospitalized

క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్ ఆస్ప‌త్రిలో చేరారు. మార్చి 27న క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్ త‌న‌కు క‌రోనా పాజిటివ్ అని ట్వీట్ చేసిన విష‌యం తెలిసిందే. క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన ఆరు రోజుల త‌రువాత వైద్యుల సూచ‌న‌ల మేర‌కు ఆస్ప‌త్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయ‌నే స్వ‌యంగా సోషల్ మీడియాలో వెల్ల‌డించారు.

తాను త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అభిమానులు చేస్తున్న ప్రార్థ‌న‌ల‌కు, వారు చూపిస్తున్న ప్రేమా ఆప్యాయ‌త‌ల‌కు ధ‌న్య‌వాదాలు చెప్పారు. వెద్యుల స‌ల‌హా మేర‌కు తగిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఆస్ప‌త్రిలో చేరిన‌ట్లు ట్వీట్ చేశారు. కొద్ది రోజుల్లోనే ఆరోగ్యంతో తిరిగి ఇంటికి వ‌స్తాన‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రూ జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ సుర‌క్షితంగా ఉండాల‌ని కోరుకున్నారు. ఇక భార‌త్ 2011లో రెండో సారి ప్రపంచ కప్ గెలిచి నేటికి 10ఏళ్లు పూరైన సంద‌ర్భంగా త‌న స‌హ‌చ‌రుల‌తో పాటు దేశ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు చెప్పారు.

భారత్‌లో కరోనా సెకండ్‌వేవ్ ప్రకంపనలు రేపుతోంది. 24 గంటల్లో రికార్డు స్థాయిలో కేసులు బయటపడ్డాయి. ఒక్కరోజులోనే 81 వేల 466 కేసులు నమోదయ్యాయి. గతేడాది అక్టోబర్‌ 2 తర్వాత దేశంలో ఇంత భారీస్థాయిలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. అంటే 182 రోజుల తర్వాత ఈ రేంజ్‌లో కేసులో రికార్డయ్యాయి. కరోనాతో 469 మంది చనిపోయారు. 117రోజుల తర్వాత అత్యధిక మరణాలు నమోదుకావడం ఇదే మొదటిసారి.‌


Next Story