చిన్ని ప్రాణాన్ని కాపాడిన స‌చిన్‌.. వైర‌ల్ వీడియో

Sachin Tendulkar Helps Rescue Injured Bird.క్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్‌ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Feb 2022 9:31 AM GMT
చిన్ని ప్రాణాన్ని కాపాడిన స‌చిన్‌.. వైర‌ల్ వీడియో

క్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్‌ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికి చాలా కాల‌మే అయినా.. క్రికెట్ ఆరాధకుల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు. ఇక ఇటీవ‌ల కాలంలో స‌చిన్ సోష‌ల్ మీడియాలో మ‌యా యాక్టివ్‌గా ఉంటున్నారు. త‌న‌కు సంబంధించిన వీడియోల‌తో పాటు మంచి విష‌యాల‌ను అభిమానుల‌తో పంచుకుంటున్నారు. కాగా.. తాజాగా స‌చిన్‌కి సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. స‌చిన్ చేసిన ప‌నిని అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు.

గాయ‌ప‌డిని ఓ సీగ‌ల్ ప‌క్షి బీచ్‌లో ప‌డింది. ఈ విష‌యాన్ని గుర్తించిన మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ దానిని చేర‌దీశాడు. దానికి నీరు తాపించే ప్ర‌య‌త్నం చేయ‌డంతో పాటు ఏదో ఆహారం కూడా పెట్టి కాస్త అది కోలుకునేలా చేశాడు. సీగ‌ల్ రెక్క‌లు బాగానే ఉన్నాయి.. అయితే ఎడ‌మ కాలికి మాత్రం గాయ‌మైంది. మ‌నం అందించే కాస్తంత ప్రేమ‌, ఆప్యాయ‌త ఈ ప్ర‌పంచాన్ని మ‌రింత అంద‌మైన ప్ర‌దేశంగా మార్చుతుంద‌నే క్యాప్ష‌న్‌తో స‌చిన్ ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోకి కోటీ 30ల‌క్ష‌లకు పైగా లైకులు వ‌చ్చాయి. స‌చిన్ ప‌క్షిపై చూపించిన ప్రేమ ప‌ట్ల ప‌లువురు అత‌డిని ప్ర‌శంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

Next Story
Share it