మరో ఖరీదైన, విలాసవంతమైన కారును కొన్న సచిన్‌ తెందూల్కర్‌...

Sachin buys Lamborghini Urus S worth over ₹4 crore. టీమిండియా మాజీ ప్లేయర్‌ సచిన్‌ తెందూల్కర్‌కు క్రికెటంటే ఎంత ఇష్టమో, కార్లంటే కూడా అంతే ఇష్టం.

By Medi Samrat  Published on  2 Jun 2023 3:30 PM
మరో ఖరీదైన, విలాసవంతమైన కారును కొన్న సచిన్‌ తెందూల్కర్‌...

టీమిండియా మాజీ ప్లేయర్‌ సచిన్‌ తెందూల్కర్‌కు క్రికెటంటే ఎంత ఇష్టమో, కార్లంటే కూడా అంతే ఇష్టం. మార్కెట్‌లోకి పసందైన కారు వచ్చిందంటే చాలు అది తన గ్యారేజ్‌లో ఉండాల్సిందే. ఇప్పటికే సచిన్‌ ఇంట్లో దాదాపు ఎనిమిది లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇప్పుడు తొమ్మిదో కారు చేరింది. లేటెస్ట్‌ టాప్‌ వేరియంట్‌ మోడల్‌ లంబోర్ఘిని ఉరుస్‌ ఎస్‌ లగ్జరీ కారును సచిన్‌ కొన్నాడు. విలాసవంతమైన ఆ లంబోర్ఘిని ఉరుస్‌ ఎస్‌ ఎక్స్‌ షో రూమ్‌ రేటు 4.18 కోట్ల రూపాయలు ఉంది. ఈ కారు ఉరుస్‌ లైనప్‌లో వచ్చిన రెండో మోడల్‌. ఇది ఉరుస్ పెర్ఫార్మంట్‌ మోడల్‌ కంటే తక్కువ ధర. ఈ కారులో సచిన్‌ తెందూల్కర్‌ ప్రయాణిస్తున్న వీడియోను ఓ యూ ట్యూబ్‌ ఛానల్ షేర్‌ చేసింది. క్రికెట్‌లో అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్న సచిన్‌ను భారత ప్రభుత్వం భారతరత్నతో గౌరవించింది. 2012 నుంచి సచిన్‌ బీఎండబ్ల్యూ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. అందుకే అతడి గ్యారేజ్‌లో చాలా బీఎండబ్ల్యూ కార్లు ఉన్నాయి. అన్నట్టు సచిన్‌కు లగ్జరీ కార్లే కాదు, మారుతి 800 అన్నా చాలా చాలా ఇష్టం. ఆ ఇష్టానికి కారణం తన మొట్టమొదటి కారు ప్రయాణం మారుతి 800 తోనే ప్రారంభం కావడం. 1989లో సచిన్‌ ఈ కారును కొన్నాడు. విశేషమేమింటే ఈ కారు ఇప్పటికీ అతడి గ్యారేజ్‌లో ఉండటం. ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ కారును సచిన్‌ జాగ్రత్తగా చూసుకుంటాడు.

Next Story