అందుకే ఓడిపోయాం.. ఓట‌మికి కార‌ణాలు చెప్పిన సీఎస్‌కే కెప్టెన్‌

IPL 2025 11వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 6 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది.

By Medi Samrat
Published on : 31 March 2025 9:33 AM IST

అందుకే ఓడిపోయాం.. ఓట‌మికి కార‌ణాలు చెప్పిన సీఎస్‌కే కెప్టెన్‌

IPL 2025 11వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 6 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో CSK జట్టు సీజన్‌లో వరుసగా రెండో ఓటమిని చవిచూడగా.. రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్‌లో మొదటి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 182 పరుగులు చేసింది, అయితే దానిని ఛేదించే క్రమంలో సీఎస్‌కే జట్టు 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విధంగా రాజస్థాన్ రాయల్స్ 6 పరుగుల తేడాతో CSKని ఓడించింది.

CSK వరుస రెండో ఓటమి తర్వాత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కోపంగా కనిపించాడు. మ్యాచ్ తర్వాత జట్టు ప్రదర్శనలో CSK బలహీనతల‌ను వెల్లడించాడు. మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. పవర్‌ప్లేలో మేము ఎక్కువ పరుగులు చేయలేకపోయాము.. దీని కారణంగా మేము లక్ష్యాన్ని ఛేజింగ్ చేయడంలో విఫ‌ల‌మ‌య్యాము. మేము ఛేజింగ్ చేయడానికి 183 పరుగుల లక్ష్యం ఉన్న‌ప్పుడు.. పిచ్ బ్యాటింగ్‌కు స‌హ‌క‌రిస్తుండ‌గా.. ఈ పరుగులు ఛేజింగ్ చేయ‌గ‌ల‌మ‌ని నేను చాలా సంతోషించాను.. కానీ ప్రారంభంలో రాహుల్ త్రిపాఠి, రచిన్ రవీంద్రల నుండి మంచి ప్రారంభాన్ని పొందలేకపోయామ‌ని నిందించాడు.

“ఇంతకుముందు.. అజింక్యా మూడవ స్థానంలో బ్యాటింగ్ చేసేవాడు. మిడిల్ ఆర్డర్ బాధ్యతను రాయుడు నిర్వహించేవాడు. మిడిల్ ఓవర్లను చూసుకోవడానికి నేను కొంచెం ఆలస్యంగా వస్తే బాగుంటుందని మేము భావించాము.. త్రిపాఠి అగ్రస్థానంలో దూకుడుగా బ్యాటింగ్ చేయగలడు. ఏది ఏమైనా పర్వాలేదు.. ఎందుకంటే టోర్నీ ప్రారంభంలోనే బ్యాటింగ్ చేసే అవకాశాల‌ను క‌ల్పించాం. ఇది వేలం సమయంలో నిర్ణయించబడింది. దానితో నాకు ఎటువంటి సమస్య లేదు. అవసరమైతే నేను రిస్క్ తీసుకుంటాను అని పేర్కొన్నాడు.

CSK ఓపెనర్ రాహుల్ త్రిపాఠి IPL 2025లో జట్టు కోసం 3 మ్యాచ్‌ల్లో ఓపెనింగ్ చేయ‌గా.. ఒక్కసారి కూడా జట్టుకు ఘనమైన ప్రారంభం ఇవ్వలేకపోయాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్‌లో రాహుల్ మ్యాచ్‌లో 2 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 5 పరుగులు, రాజస్థాన్‌పై 19 బంతుల్లో 23 పరుగులు చేశాడు.

Next Story