అలా ఎలా జరిగిందో నాకూ తెలియదు.. ఓట‌మికి కార‌ణాలు చెప్పిన సీఎస్‌కే కెప్టెన్‌

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 17 ఏళ్లుగా జరగని పని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శుక్రవారం చేసి చూపింది.

By Medi Samrat
Published on : 29 March 2025 7:34 AM IST

అలా ఎలా జరిగిందో నాకూ తెలియదు.. ఓట‌మికి కార‌ణాలు చెప్పిన సీఎస్‌కే కెప్టెన్‌

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 17 ఏళ్లుగా జరగని పని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శుక్రవారం చేసి చూపింది. లీగ్ 18వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై RCB 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. 17 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై ఐపీఎల్‌లో చెన్నైని ఆర్సీబీ ఓడించింది. అంతకు ముందు 2008లో రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలో RCB చెన్నైని ఓడించింది. చెన్నై ఓటమి తర్వాత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ నిరాశ‌ను వ్య‌క్తం చేశాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ ఏడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. చెన్నై జట్టు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ సీజన్‌లో చెన్నైకి ఇదే తొలి ఓటమి. ఓటమికి గల కారణాన్ని కెప్టెన్ గైక్వాడ్ వివరించాడు.

మ్యాచ్ తర్వాత గైక్వాడ్ చాలా నిరాశగా కనిపించాడు. జట్టు ఫీల్డింగ్‌ను తప్పుబట్టాడు. చెన్నై ఫీల్డర్లు RCB కెప్టెన్ రజత్ పాటిదార్ ఇచ్చిన మూడు క్యాచ్‌లను జారవిడిచారు. దీంతో అత‌డు నిర్ణయాత్మక 51 పరుగులు సాధించగలిగాడు.

మ్యాచ్ అనంతరం గైక్వాడ్ మాట్లాడుతూ.. "ఈ వికెట్‌పై 170 పరుగులు మంచి స్కోరుగా నేను భావిస్తున్నాను. బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. మా ఫీల్డింగ్ మమ్మల్ని బాధించింది. మ‌నం 170 పరుగులను ఛేజ్ చేయ‌డానికి కొంత‌ సమయం ల‌భిస్తుంంది. కానీ 20 పరుగులు టార్గెట్‌ ఎక్కువ అయినప్పుడు.. పవర్‌ప్లేలో భిన్నంగా బ్యాటింగ్ చేయాలి. ఇది ఈరోజు జరగలేదన్నాడు.

పిచ్ నెమ్మదిస్తూనే ఉంది. బంతి పిచ్‌పై క‌ద‌ల‌డం లేదు. కొత్త బంతి కూడా పిచ్‌పై ఆగుతుంది. అలా ఎలా జరిగిందో నాకు తెలియదు. రాహుల్ త్రిపాఠి అతని షాట్లు అత‌ను ఆడుతాడు, నేను నా షాట్‌లు ఆడాను. కొన్నిసార్లు అవి పని చేస్తాయి.. కొన్నిసార్లు అవి జరగవు. మేము భారీ తేడాతో ఓడిపోలేదన్నాడు.

గౌహతిలో రాజస్థాన్ రాయల్స్‌తో సీఎస్‌కే తదుపరి మ్యాచ్ ఆడాల్సి ఉందని గైక్వాడ్ చెప్పాడు. ఈ ఓటమిని జట్టు మానసికంగా మరిచిపోవాల్సి ఉంటుంద‌ని అన్నాడు. గౌహతి మ్యాచ్‌కు ఇంకా సమయం ఉంది.. మేం ఇప్పుడు మానసికంగా సంసిద్ధంగా ఉండాలి.. ఎక్కడ మెరుగుపడాలో చూడాలి. ఫీల్డింగ్‌లో ఇంకా మెరుగవ్వాలని భావిస్తున్నా' అని చెప్పాడు.

Next Story