ఆ హీరోయిన్స్ హాట్ వీడియోల కోసం వెతికిన యంగ్ క్రికెటర్?

రాజస్థాన్ రాయల్స్ స్టార్ బ్యాటర్ రియాన్ పరాగ్ IPL 2024లో తన బ్యాటింగ్ తో మంచి పేరును సొంతం చేసుకున్నాడు.

By Medi Samrat
Published on : 28 May 2024 4:00 AM

ఆ హీరోయిన్స్ హాట్ వీడియోల కోసం వెతికిన యంగ్ క్రికెటర్?

రాజస్థాన్ రాయల్స్ స్టార్ బ్యాటర్ రియాన్ పరాగ్ IPL 2024లో తన బ్యాటింగ్ తో మంచి పేరును సొంతం చేసుకున్నాడు. అయితే టోర్నమెంట్ ముగిసిన ఒక రోజు తర్వాత అతను మళ్లీ వార్తల్లో నిలిచాడు. రియాన్ పరాగ్ యూట్యూబ్ సెర్చ్ హిస్టరీ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పరాగ్ తన కంప్యూటర్ ముందు కూర్చున్నట్లు చూపిస్తుంది.. అయితే బ్యాక్ గ్రౌండ్ స్క్రీన్ అతను "అనన్య పాండే హాట్, సారా అలీ ఖాన్ హాట్" వంటి కంటెంట్ కోసం యూట్యూబ్ లో వెతికినట్లు చూపిస్తుంది. ఈ వీడియో ప్రామాణికత సందేహాస్పదంగా ఉంది. దీనిపై సరైన క్లారిటీ రావాల్సి ఉంది. క్వాలిఫైయర్ 2లో ఆర్ఆర్ IPL 2024 లో ఓటమి పాలైన తర్వాత అతడి ప్రతిష్టను దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నమని కూడా అంటున్నారు.

ఈ సీజన్‌లో 500కి పైగా పరుగులు చేసిన స్టార్లలో పరాగ్ ఒకడు. అతను IPL 2024లో 16 మ్యాచ్ లలో 52 కంటే ఎక్కువ సగటుతో నాలుగు అర్ధ సెంచరీలతో 573 పరుగులతో మూడవ అత్యుత్తమ బ్యాటర్‌గా నిలిచాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పరాగ్‌కి ఇది అత్యుత్తమ సీజన్.

Next Story