ఐపీఎల్ 2026 సీజన్ కోసం బెంగళూరు లోని ఎం.చిన్నస్వామి స్టేడియం ముస్తాబవుతోంది. గతేడాది జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా ఈ స్టేడియంపై సందిగ్ధత నెలకొంది. అయితే, కర్ణాటక ప్రభుత్వం, ఉన్నత స్థాయి కమిటీల ఆమోదం తర్వాత మళ్లీ ఇక్కడ మ్యాచ్‌ల నిర్వహణకు లైన్ క్లియర్ అయ్యింది.
ప్రస్తుత ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తన హోమ్ గ్రౌండ్‌లో ఐదు లీగ్ మ్యాచ్‌లను ఆడనుంది. మిగిలిన రెండు హోమ్ మ్యాచ్‌లు రాయ్‌పూర్‌లో జరుగుతాయి. ఐపీఎల్ 2026 సీజన్ గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీ (ప్రారంభ వేడుక), సీజన్ తొలి మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలోనే జరగనున్నాయి. ప్రేక్షకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని స్టేడియం సామర్థ్యాన్ని 35,000 కు పరిమితం చేశారు. అలాగే ప్రభుత్వం సూచించిన పలు భద్రతా మార్పులను పూర్తి చేశారు