సరిలేరు నీకెవ్వరు.. క్రిస్టియానో రొనాల్డో మరో ప్రపంచ రికార్డ్

Ronaldo sets new international goals world record.పుట్‌బాల్‌ చరిత్రలో అరుదైన ఘనత సాధించాడు లెజెండరీ ప్లేయర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Sep 2021 5:56 AM GMT
సరిలేరు నీకెవ్వరు.. క్రిస్టియానో రొనాల్డో మరో ప్రపంచ రికార్డ్

పుట్‌బాల్‌ చరిత్రలో అరుదైన ఘనత సాధించాడు లెజెండరీ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో. ఈ గేమ్ లో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించాడు ఈ పోర్చుగల్ స్టార్. అంత‌ర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్‌లో అత్య‌ధిక గోల్స్ సాధించిన ఆట‌గాడిగా నిలిచాడు. వ‌ర‌ల్డ్ క‌ప్ క్వాలిఫ‌యింగ్ టోర్నీలో ఐర్లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ సాధించి పోర్చుగ‌ల్ కెప్టెన్ రోనాల్డ్ ఈ ఘ‌న‌త సాధించాడు. ఇరాన్ ఫుట్‌బాల్ ఆట‌గాడు అలీ డేయీ పేరిట ఉన్న 109 అంత‌ర్జాతీయ గోల్స్ రికార్డును రోనాల్డో బ్రేక్ చేశాడు. తాజాగా రొనాల్డో ఖాతాలో 111 అంత‌ర్జాతీయ గోల్స్ ఉన్నాయి.

ఐర్లాండ్‌తో మ్యాచ్‌ జరగకముందు ఫుట్‌బాల్ కెరీర్‌లో అత్య‌ధిక గోల్స్ సాధించిన ఆట‌గాడిగా ఇరాన్‌కు చెందిన అలీ డేయీ (109)తో సమానంగా క్రిస్టియానో రోనాల్డో ఉన్నాడు. యూరో 2020 ఫుట్‌బాల్ టోర్నీ ద్వారా అలీ డేయీ రికార్డును అతడు సమం చేశాడు. తాజాగా వ‌ర‌ల్డ్ క‌ప్ క్వాలిఫ‌యింగ్ టోర్నీలో ఐర్లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ సాధించడంతో అలీ డేయీ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో పోర్చుగ‌ల్ 2-1 తేడాతో విజ‌యం సాధించింది.

అంత‌ర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నీల్లో.. 90 క‌న్నా ఎక్కువ గోల్స్ చేసిన ఆట‌గాళ్ల‌లో అలీ డేయీ, రోనాల్డ్‌లు ఉన్నారు. మొఖ్తర్ దహరి (89), ఫెరెంక్ పుస్కేస్ (84), గాడ్‌ఫ్రే చిటాలు (79), హుస్సేన్ సయీద్ (78), పీలే (77) అలీ మబ్ఖౌట్ (76), లియోనెల్ మెస్సీ 76 త‌రువాతి స్థానాల్లో ఉన్నారు.

Next Story