Video : రోహిత్ త‌న‌ '264' నంబ‌ర్ కారును పోగొట్టుకోనున్నాడా.? ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడు.?

భారత కెప్టెన్ రోహిత్ శర్మకు కార్లంటే చాలా ఇష్టం. రోహిత్ తరచుగా ముంబైలో తన కారులో ప్రయాణిస్తూ కనిపిస్తాడు..

By Medi Samrat  Published on  15 March 2025 3:08 PM IST
Video : రోహిత్ త‌న‌ 264 నంబ‌ర్ కారును పోగొట్టుకోనున్నాడా.? ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడు.?

భారత కెప్టెన్ రోహిత్ శర్మకు కార్లంటే చాలా ఇష్టం. రోహిత్ తరచుగా ముంబైలో తన కారులో ప్రయాణిస్తూ కనిపిస్తాడు.. అభిమానులకు అతని కార్ కలెక్షన్ గురించి తెలుసు. అయితే రోహిత్‌ తన కారు లాంబోర్గినీ కోసం ఏడుస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో బయటికి రావడంతో మొత్తం విషయం బట్టబయలైంది.

నిజానికి ఐపీఎల్ 18వ సీజన్ కోసం అడ్వర్టైజింగ్ కంపెనీలు సిద్ధమయ్యాయి. విభిన్న రకాల ఆలోచనలతో త‌మ ఉత్పత్తి ప్రకటనలను రూపొందించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ కంపెనీకి ప్రకటనలు ఇస్తున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఏడ్చినట్లు నటించాల్సి వచ్చింది. మార్చి 15 శనివారం నాడు రోహిత్ తన అధికారిక X ఖాతాలో దీనికి సంబంధించిన వీడియోను పంచుకున్నాడు.

అందులో భారత కెప్టెన్ ఏడుస్తూ విచారంగా కనిపించాడు. ప్రకటనలో రెండు భాగాలు ఉన్నాయని.. పోటీలో గెలిచిన వారికి తన లాంబోర్గినీ కారును గెలుచుకునే అవకాశం ఉంటుందని రోహిత్ చెప్పాడు.

రెండవ వీడియోలో రోహిత్ చాలా సంతోషంగా ఉన్నట్లు చూపబడింది.. కానీ ఒక అభిమాని కారు తీసుకుని భారత కెప్టెన్‌ను సురక్షితంగా వెళ్ల‌మని కోరాడు. ఆ త‌ర్వాత రోహిత్‌ ఆటో ఎక్కి డ్రైవర్‌ను మీటర్ వేయ‌మ‌ని అడిగాడు.

వీడియోను పంచుకుంటూ.. రోహిత్ 264 మంది అభిమానుల కోసం ఎప్పుడూ ఉంటుంది అని రాశాడు. శ్రీలంకపై రోహిత్ 264 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. త‌న‌ లాంబోర్గినీ కారుకు కూడా '264' అనే నంబర్ ఉంది. ప్ర‌స్తుతం ఆ కారులో ఓ యాడ్ చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా ఇలా న‌టించాల్సివ‌చ్చింది. అయితే నిజంగానే రోహిత్ త‌న కారును అభిమానుల‌కు ఇచ్చేస్తాడా అనే చ‌ర్చ తీవ్రంగా జ‌రుగుతుంది.

Next Story