అదరగొట్టిన‌ రోహిత్ శర్మ..!

విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జైపూర్ వేదికగా సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

By -  Medi Samrat
Published on : 24 Dec 2025 4:52 PM IST

అదరగొట్టిన‌ రోహిత్ శర్మ..!

విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జైపూర్ వేదికగా సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముంబై తరపున ఆడుతున్న రోహిత్ శర్మ బ్యాటింగ్ లో అలరించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సిక్కిం నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై 30 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 237 పరుగుల లక్ష్యాన్ని చేరుకుంది. రోహిత్ శర్మ 94 బంతుల్లో 155 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రోహిత్ ఇన్నింగ్స్ 18 ఫోర్లు, 9 సిక్సులు ఉన్నాయి. ఆఖర్లో ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్ సోదరులు ముంబైని విజయతీరాలకు చేర్చారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా రోహిత్ శర్మ నిలిచాడు. సిక్కిం బ్యాటర్లలో ఆశిష్ (87 బంతుల్లో 8 ఫోర్లుతో 79 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కె.సాయి సాత్విక్ (34), క్రాంతి కుమార్ (34), రాబిన్ లింబో (31 నాటౌట్)లు పర్వాలేదనిపించారు.

Next Story