సరికొత్త రికార్డును నమోదు చేసిన రోహిత్ శర్మ

Rohit Sharma Bags News Record. చెన్నై టెస్ట్ మ్యాచ్ లో భారత్ మొదటి ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ భారీ సెంచరీ బాదిన సంగతి తెలిసిందే.

By Medi Samrat  Published on  14 Feb 2021 8:51 AM GMT
Rohit Sharma Bags News Record

చెన్నై టెస్ట్ మ్యాచ్ లో భారత్ మొదటి ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ భారీ సెంచరీ బాదిన సంగతి తెలిసిందే..! 231 బంతులాడిన రోహిత్‌ 18 ఫోర్లు, 2 సిక్స్‌లతో 161 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా రోహిత్ అరుదైన రికార్డును అందుకున్నాడు. స్వదేశంలో 200 సిక్స్‌లు కొట్టిన తొలి భారత ఆటగాడిగా రోహిత్‌ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో జరగుతున్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 97 పరుగుల వద్ద రోహిత్‌ ఈ ఘనత అందుకున్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని స్వదేశంలో 186 సిక్స్‌లు బాదగా, ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ 113 సిక్స్‌లు కొట్టాడు.

ఓవరాల్‌గా ఇప్పటివరకు రోహిత్‌ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు కలుపుకొని 428 సిక్స్‌లతో మూడో స్థానంలో ఉన్నాడు.వెస్టిండీస్‌ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌ గేల్‌ అన్ని ఫార్మాట్లు కలిపి 534 సిక్స్‌లతో అగ్రస్థానంలో ఉండగా.. పాక్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ ఆఫ్రిది 476 సిక్స్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక టీమిండియా నుంచి ఎంఎస్‌ ధోని 359 సిక్స్‌లతో ఆరో స్థానంలో నిలిచాడు. ఆఫ్రిది ఇప్పటికే రిటైర్‌ కావడంతో.. రోహిత్‌ త్వరలోనే అతన్ని అధిగమించే అవకాశం ఉంది.

భారత్ తొలి ఇన్నింగ్స్ లో 329 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. ఓవ‌ర్ నైట్ స్కోర్ 300/‌6 తో రెండో రోజు ఆటను కొన‌సాగించిన భార‌త్ ఇంకో 29 ప‌రుగులు మాత్ర‌మే జోడించి చివ‌రి నాలుగు వికెట్లు కోల్పోయింది. రిష‌బ్‌పంత్ (58, 77 బంతుల్లో 7 పోర్లు, 3 సిక్స‌ర్లు) అర్థ‌శ‌త‌కంతో రాణించ‌డంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 329 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. ఇక ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో కష్టాల్లో పడింది. 87 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.




Next Story