సూర్య‌కుమార్ ర‌నౌట్‌పై రోహిత్ ఏమ‌న్నాడంటే..?

Rohit Sharma About Suryakumar Runout. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2020 ఫైన‌ల్‌లో ముంబై ఇండియ‌న్స్ విజ‌యం

By Medi Samrat  Published on  11 Nov 2020 7:47 AM GMT
సూర్య‌కుమార్ ర‌నౌట్‌పై రోహిత్ ఏమ‌న్నాడంటే..?

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2020 ఫైన‌ల్‌లో ముంబై ఇండియ‌న్స్ విజ‌యం సాధించింది. ఢిల్లీ క్యాపిట‌ల్స్‌పై 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించి ఐదో సారి టైటిల్‌ను త‌మ ఖాతాలో వేసుకుంది. ఇక టీమ్ ప్ర‌ద‌ర్శ‌న ప‌ట్ల, మ్యాచ్‌లో సూర్య కుమార్ ర‌నౌట్ ఘ‌ట‌న పై రోహిత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

డిల్లీ నిర్దేశించిన 157 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న‌లో రోహిత్ శ‌ర్మ‌(68) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడ‌గా.. సూర్య‌కుమార్ యాద‌వ్‌(19), ఇషాన్ కిష‌న్‌(33), డికాక్‌(20) లు రాణించడంతో ముంబై 18.4 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి విజ‌యాన్ని అందుకుంది. కాగా.. ఇన్నింగ్ 11వ ఓవ‌ర్‌లో రోహిత్ చేసిన త‌ప్పుకు సూర్య‌కుమార్ ర‌నౌట్ అయ్యాడు. అశ్విన్ బౌలింగ్‌లో రోహిత్ సింగిల్ కోసం ప్ర‌య‌త్నించ‌డంతో సూర్య‌కుమార్ ర‌నౌట్‌గా వెనుదిరిగాడు. హిట్ మ్యాన్ బంతిని చూసుకోకుండా ప‌రిగెత్త‌డంతో సూర్య నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లోనే ఉండిపోయాడు. పీల్డ‌ర్ బంతిని కీప‌ర్‌కు అందించ‌గా అప్ప‌టికే రోహిత్ అవ‌తివైపు క్రీజులోకి చేరాడు. దాంతో సూర్య కుమార్ త‌న వికెట్‌ను త్యాగం చేయాల్సి వ‌చ్చింది.

కాగా.. ఈ ఘ‌ట‌న‌పై మ్యాచ్ అనంత‌రం హిట్‌మ్యాన్ స్పందించాడు. సూర్య‌కుమార్ యాద‌వ్ ప్ర‌స్తుత ఫామ్ ప్ర‌కారం చూసుకుంటే.. త‌న వికెట్ వ‌దులు కోవాల్సింద‌ని చెప్పాడు. 'ఈ సీజన్‌ మొత్తం గొప్పగా శ్రమించాం. ఈ విజయంలో భాగం కావడం సంతోషంగా ఉంది. ఇది గొప్ప అనుభూతి. విజయాలను అలవాటుగా మార్చుకోవాలని టోర్నీ ఆరంభంలో చెప్పా. టీమ్ ఆటగాళ్లు దానిని చేసి చూపించారు' అని రోహిత్ శ‌ర్మ అన్నాడు. తాము మొదటి నుంచి టైటిల్ లక్ష్యంగానే ఆడామని, సీజన్‌ మొత్తం తమకు అనుకూలంగా సాగిందని తెలిపాడు.

తాను బెత్తం పట్టుకుని బాగా ఆడమని చెప్పే రకం కాదని, జట్టు సభ్యుల్లో ఆత్మవిశ్వాసం నింపడమే కెప్టెన్‌గా తన పని అని చెప్పుకొచ్చాడు. జట్టులో అందరూ బాగా ఆడుతుండటంతో ఎప్పటికప్పుడు తుది జట్టును మార్చుకునే సౌలభ్యం తమకు కలిగిందన్నాడు. ఇషాన్ కిషన్‌, సూర్యకుమార్ చాలా బాగా ఆడార‌న్నాడు.


Next Story
Share it