వన్డేల్లో 10వేల పరుగుల క్లబ్‌లో చేరిన రోహిత్‌ శర్మ

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మరో రికార్డును అందుకున్నారు. వన్డేల్లో 10వేల పరుగులు సాధించిన వారి జాబితాలో నిలిచాడు.

By Srikanth Gundamalla  Published on  12 Sep 2023 10:37 AM GMT
Rohit, 10,000 runs, ODI,  Asia Cup-23, Team India,

వన్డేల్లో 10వేల పరుగుల క్లబ్‌లో చేరిన రోహిత్‌ శర్మ

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మరో రికార్డును అందుకున్నారు. వన్డేల్లో 10వేల పరుగులు సాధించిన వారి జాబితాలో నిలిచాడు. ఆసియా కప్-2023 టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీలో భాగంగా శ్రీలంకతో జరిగిన సూపర్‌-4 మ్యాచ్‌లో ఈ మైలురాయిని అందుకున్నారు రోహిత్‌ శర్మ. కసున్ రజిత ఓవర్‌లో లాంగ్‌ ఆఫ్‌లో భారీ సిక్సర్‌ను బాది 10వేల రన్స్‌ పూర్తి చేసుకున్నాడు హిట్‌మ్యాన్. తక్కువ ఇన్నింగ్స్‌లో స్టార్‌ బ్యాటర్ కోహ్లీ తర్వాత ఈ క్లబ్‌లో చేరిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు.

అయితే.. హిట్‌ మ్యాన్ 241 ఇన్నింగ్స్‌ ఆడి 10వేల రన్స్‌ను సాధించాడు. కాగా.. విరాట్‌ కోహ్లీ మాత్రం 205 ఇన్నింగ్స్‌లోనే 10వేల మార్క్‌ను అధిగమించాడు. ఇక భారత జట్టు తరఫున 10వేల పరుగులు సాధించిన ఆరో క్రికెటర్‌గా రోహిత్ ఉన్నాడు. హిట్‌మ్యాన్ కంటే ముందు సచిన్ టెండూల్కర్ (18,426), విరాట్ కోహ్లీ(13,024) సౌర‌భ్ గంగూలీ(11,363), రాహుల్ ద్ర‌విడ్(10,889), ఎంఎస్ ధోనీ(10,773)లు ఈ ఫీట్ సాధించారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ మైలురాయి సాధించిన 15వ ఆటగాడిగా రోహిత్‌ శర్మ గుర్తింపు పొందారు. 248 వ‌న్డే మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శ‌ర్మ 30 సెంచ‌రీలు, 51 హాఫ్ సెంచ‌రీలు బాదాడు. అంతేకాదే మూడు సార్లు వ‌న్డేల్లో డ‌బుల్ సెంచ‌రీ చేసిన తొలి క్రికెట‌ర్ కూడా. వ‌న్డేల్లో రోహిత్ అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోర్ 264 పరుగులు.

మిగతా దేశాలకు చెందిన ప్లేయర్ల జాబితా చూసినట్లు అయితే.. శ్రీ‌లంక దిగ్గ‌జం కుమార సంగ‌ర్క‌ర‌(14,234), ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్‌(13,704), స‌న‌త్ జ‌య‌సూర్య‌(13,430), మ‌హేల జ‌య‌వ‌ర్ద‌నే(12,650), పాక్ మాజీ కెప్టెన్ ఇంజ‌మాముల్ హ‌క్‌(11,739), ద‌క్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండ‌ర్ జాక్వెస్ క‌లిస్(11,579), వెస్టిండీస్ మాజీ విధ్వంస‌క ఓపెన‌ర్ క్రిస్ గేల్(10,480), బ్రియాన్ లారా(10,405), లంక మాజీ ఓపెన‌ర్ తిల‌క‌ర‌త్నే దిల్షాన్‌(10,290)లు వ‌న్డేల్లో 10 వేల ప‌రుగుల క్ల‌బ్‌లో చోటు ద‌క్కించుకున్నారు.

Next Story