కోహ్లీ కారణంగానే యువరాజ్ కెరీర్ ముగిసిందా.? మాజీ బ్యాట్స్‌మెన్ సంచ‌ల‌న‌ ప్రకటన

యువరాజ్ సింగ్ కెరీర్ తొందరగా ముగియడానికి విరాట్ కోహ్లీ కెప్టెన్సీని భారత జట్టు మాజీ బ్యాట్స్‌మెన్ రాబిన్ ఉతప్ప పరోక్షంగా తప్పుపట్టాడు

By Medi Samrat  Published on  10 Jan 2025 2:33 PM IST
కోహ్లీ కారణంగానే యువరాజ్ కెరీర్ ముగిసిందా.? మాజీ బ్యాట్స్‌మెన్ సంచ‌ల‌న‌ ప్రకటన

యువరాజ్ సింగ్ కెరీర్ తొందరగా ముగియడానికి విరాట్ కోహ్లీ కెప్టెన్సీని భారత జట్టు మాజీ బ్యాట్స్‌మెన్ రాబిన్ ఉతప్ప పరోక్షంగా తప్పుపట్టాడు. క్యాన్సర్‌ నుంచి కోలుకున్న తర్వాత యువరాజ్‌ ఫిట్‌నెస్‌ నుంచి కొంత సడలింపు కోరాడని.. అయితే దానిని అప్పటి భారత కెప్టెన్‌ కోహ్లీ తిరస్కరించాడని ఉతప్ప పేర్కొన్నాడు. యువరాజ్ భారతదేశపు పరిమిత ఓవర్ల లెజెండరీ ఆల్ రౌండర్.. 2011 ODI ప్రపంచ కప్‌లో జట్టు టైటిల్ విజయంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు.

2011 ODI ప్రపంచ కప్ టైటిల్ విజయం తర్వాత.. యువరాజ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు.. దాని కోసం అతను అమెరికాలో చికిత్స పొందాడు. యువరాజ్ క్యాన్సర్ నుండి కోలుకున్న తర్వాత భారత జట్టులోకి తిరిగి వచ్చాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన ODI మ్యాచ్‌లో సెంచరీ కూడా సాధించాడు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ 2017లో పేలవమైన ప్రదర్శన తర్వాత.. అతడు జట్టులో స్థానం కోల్పోయాడు. దీంతో అత‌డు 2019లో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు.

యువరాజ్‌ సింగ్‌ను ఉదాహరణగా తీసుకోండి’ అని ఉతప్ప అన్నాడు. ఆ వ్యక్తి క్యాన్సర్‌ను ఓడించి అంతర్జాతీయ జట్టులోకి తిరిగి వ‌చ్చాడు. మన‌ల్ని రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిల‌ప‌డంలో ఆ వ్యక్తి ముఖ్యమైన పాత్ర పోషించాడు. మీరు కెప్టెన్ అయితే అటువంటి ఆటగాడి సామర్థ్యం తగ్గిపోయిందని మీరు చెబుతారా.. ఆ ఆటగాడు కష్టపడటం మీరు చూశారు. ఈ విష‌యం గురించి ఎవరూ నాకు చెప్పలేదు కాని నేను అంచనా వేస్తున్నాను.

అతడు కష్టపడటం చూసిన ఓ వ్య‌క్తి.. త‌ను కెప్టెన్ అయ్యాక కొన్ని ప్రమాణాలు పెట్టుకుని హోదాను నిలబెట్టుకోవాలి. ప్రతి సందర్భంలో కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఇక్కడ నేను మినహాయింపుకు అర్హత ఉన్న‌ వ్యక్తి గురించి మాట్లాడుతున్నా.. ఆ వ్యక్తి మ‌న‌ కోసం మెగా టోర్నమెంట్లను గెలవడమే కాకుండా క్యాన్సర్‌ను కూడా ఓడించాడు. యువీ రెండు పాయింట్ల కోత కోసం అభ్యర్థించగా.. అతడు దానిని పొందలేక‌పోయాడు. దీంతో అతడు ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాతే జట్టులోకి వచ్చాడు.. కానీ ఒక టోర్నమెంట్‌లో పేలవమైన ప్రదర్శన తర్వాత.. అతడు జ‌ట్టు నుంచి తొలగించబడ్డాడు. మళ్లీ ఎన్నడూ యువీ పేరును సెల‌క్ష‌న్‌కు పరిగణలోనికి తీసుకోలేదు. అప్పుడు విరాట్ కెప్టెన్.. ఏది జరిగినా అతని ఇష్ట‌ ప్రకారమే జరిగివుంటుంది.. నేను విరాట్ కెప్టెన్సీలో ఎక్కువ ఆడలేదు.. కానీ కెప్టెన్‌గా అతడు తన కోరిక ప్రకారం ప్రతిదీ జరగాలని కోరుకున్నాడు.. అతను అలాంటి కెప్టెన్.. ఇది ఫలితాల గురించి మాత్రమే కాదు.. మీ బృందం, సహచరులతో మీరు వ్యవహరించే విధానం గురించి కూడా చెబుతుంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు.

Next Story