ఇండియా లెజెండ్స్ వర్సెస్ బంగ్లాదేశ్ లెజెండ్స్.. సచిన్, యువరాజ్ గ్రౌండ్ లో..!

Road Safety World Series 2021. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో భాగంగా ఈరోజు ఇండియా లెజెండ్స్ టీమ్ బంగ్లాదేశ్ లెజెండ్స్ తో ఆడబోతోంది.

By Medi Samrat  Published on  5 March 2021 12:36 PM GMT
Road Safety World Series 2021

సచిన్, సెహ్వాగ్, యువరాజ్ సింగ్ లాంటి లెజెండ్స్ ను మళ్లీ గ్రౌండ్ లో చూడాలని అందరికీ అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో భాగంగా ఈరోజు ఇండియా లెజెండ్స్ టీమ్ బంగ్లాదేశ్ లెజెండ్స్ తో ఆడబోతోంది. ఈ సిరీస్ లో ఇప్పటికే ఇండియా లెజెండ్స్ జట్టు రెండు మ్యాచ్ లను గెలిచింది. గతేడాది కరోనా కారణంగా నిలిచిన ఈ సిరీస్ ను ఈ ఏడాది తిరిగి మొదలు పెట్టారు. నేటి నుండి గత సీజన్ ను కొనసాగిస్తూ ఉన్నారు. ఇండియా లెజెండ్స్ జట్టుకు సచిన్ టెండూల్కర్ కెప్టెన్ గా వ్యవహరిస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! బంగ్లాదేశ్ లెజెండ్స్ జట్టుకు ఖలీద్ మహమూద్ కెప్టెన్ గా వ్యవహిస్తున్నాడు. సాయంత్రం 7 గంటలకు రాయ్ పూర్ లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో జరగనుంది. కలర్స్ సినీ ప్లెక్స్ ఛానల్ లో మ్యాచ్ లైవ్ టెలీకాస్ట్ చేయనున్నారు. Voot యాప్ లో కూడా మ్యాచ్ ను చూడొచ్చు. ఈ టోర్నమెంట్ కు ఇండియా లెజెండ్స్ జట్లు ప్రాక్టీస్ ను మొదలుపెట్టేశాయి. అందుకు సంబంధించిన వీడియోలను సచిన్, యువరాజ్ లు తమ తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో అప్లోడ్ చేశారు.

Squads:

India Legends Squad: Virender Sehwag, Sachin Tendulkar(c), Mohammad Kaif, Yuvraj Singh, Yusuf Pathan, Irfan Pathan, Manpreet Gony, Naman Ojha(w), Munaf Patel, Vinay Kumar, Pragyan Ojha, S Badrinath, Noel David

Bangladesh Legends Squad: Aftab Ahmed, Javed Omar, Nafees Iqbal, Hannan Sarkar, Khaled Mashud(w), Mohammad Sharif, Rajin Saleh, Khaled Mahmud(c), Mehrab Hossain, Abdur Razzak, Mohammad Rafique, Mushfiqur Rahman, Nazimuddin, Alamgir Kabir, Mamun Rashed

Schedule:

India legends vs Bangladesh legends – Friday, 5 March – 7:00 PM

Sri Lanka legends vs West Indies legends – Saturday, 6 March – 7:00 PM

England legends vs Bangladesh legends – Sunday, 7 March – 7:00 PM

South Africa legends vs Sri Lanka legends – Monday, 8 March – 7:00 PM

India legends vs England legends – Tuesday, 9 March – 7:00 PM

Bangladesh legends vs Sri Lanka legends – Wednesday, 10 March – 7:00 PM

England legends vs South Africa legends – Thursday, 11 March – 7:00 PM

Bangladesh legends vs West Indies legends – Friday, 12 March – 7:00 PM

India legends vs South Africa legends – Saturday, 13 March – 7:00 PM

Sri Lanka legends vs England legends – Sunday, 14 March – 7:00 PM

South Africa legends vs Bangladesh legends – Monday, 15 March – 7:00 PM

England legends vs West Indies legends – Tuesday, 16 March – 7:00 PM

Semi-final 1 – Wednesday, 17 March – 7:00 PM

Semi-final 2 – Friday, 19 March – 7:00 PM

Finals – Sunday, 21 March – 7:00 PM


Next Story
Share it