సిరాజ్ వర్సెస్ రియాన్ పరాగ్.. గొడవ ఇదే..!
Riyan Parag breaks silence on fight with Harshal in IPL 2022. రాజస్థాన్ రాయల్స్ 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో
By Medi Samrat Published on 6 Jun 2022 5:22 PM ISTరాజస్థాన్ రాయల్స్ 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్‌లో ఏడు వికెట్ల తేడాతో ఓటమిని అందుకోవడంతో.. రన్నరప్‌గా నిలిచింది. సీజన్ మొత్తంలో రాయల్స్ మంచి ప్రదర్శనల ఇచ్చింది. ఓపెనర్ జోస్ బట్లర్ ఆరెంజ్ క్యాప్‌ను పొందగా, లెగ్-స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ పర్పుల్ క్యాప్ ను గెలుచుకున్నాడు. దివంగత షేన్ వార్న్ కెప్టెన్సీలో టైటిల్‌ను కైవసం చేసుకున్న 2008 తర్వాత ఐపీఎల్‌లో రాయల్స్ ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి. కానీ ఫైనల్ లో గుజరాత్ చేతిలో పరాజయాన్ని మూటగట్టుకుంది. చాలా మంది ఆటగాళ్ళు ఈ సీజన్ మొత్తంలో కీలక ప్రదర్శనలతో రాయల్స్ ను ముందుకు నడిపించారు. వారిలో యువ ఆటగాడు రియాన్ పరాగ్ ఒకరు. అతడు సీజన్‌ను అత్యధిక క్యాచ్‌లతో ముగించాడు (17). 14 ఇన్నింగ్స్‌ల్లో ఒక హాఫ్ సెంచరీతో సహా 183 పరుగులు చేశాడు.
రాజస్తాన్ రాయల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ లో రియాన్ పరాగ్ ప్రవర్తన వార్తల్లో నిలిచింది. సీనియర్ ప్లేయర్లైన హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్ లతో వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా ఆ ఘటనకు సంబంధించి రియాన్ పరాగ్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ మ్యాచ్ లో తాను హర్షల్ ను అభ్యంతరకరంగా ఏమీ అనలేదని.. కానీ మహ్మద్ సిరాజ్ నాతో వాగ్వాదానికి దిగాడని చెప్పుకొచ్చాడు.
పరాగ్ మాట్లాడుతూ. 'గతేడాది ఐపీఎల్ లో నేను హర్షల్ బౌలింగ్ లో ఔటయ్యా. అప్పుడు నన్ను అక్కడ్నుంచి వెళ్లిపో అన్నట్టుగా అతడు సైగ చేశాడు. అయితే అది నేను మైదానంలో చూడలేదు. పెవిలియన్ కు వెళ్లాక టీవీ రిప్లైలలో చూశాను. అప్పట్నుంచి నా మనసులో అది అలాగే ఉండిపోయింది. ఇక ఈ సీజన్ లో ఆర్సీబీతో మ్యాచ్ లో హర్షల్ బౌలింగ్ లో నేను రెండు సిక్సర్లు కొట్టడంతో గతంలో అతడు ఎలా చేశాడో నేనూ అదే చేశాను.' అని చెప్పుకొచ్చాడు. ఎవరినీ తిట్టలేదు. ఏ అభ్యంతరకరమైన మాటలూ అనలేదు. హర్షల్ కూడా అప్పుడు ఏమీ అనలేదు. కానీ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత మహ్మద్ సిరాజ్ నన్ను పిలిచి.. 'పిల్లాడివి పిల్లాడిలా ప్రవర్తించు.'అని నాతో చెప్పాడన్నాడు. అప్పుడు నేను సిరాజ్ తో.. నేను నీతో ఏం చెప్పదలుచుకోలేదు భయ్యా.. అని చెప్పాను. అప్పటికే మా ఇద్దరికీ మాటా మాటా పెరగడంతో ఇరు జట్ల ఆటగాళ్లు వచ్చి మమ్మల్ని ఆపారని చెప్పుకొచ్చాడు రియాన్ పరాగ్.