ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరానికి వచ్చిన రిషబ్ పంత్.. మరో స్టార్ ప్లేయర్ కూడా వచ్చేశాడు.!
Rishabh Pant visits Delhi Capitals' training session in Bengaluru. ఐపీఎల్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బ్యాడ్ ఫామ్‌తో ఇబ్బంది పడుతోంది.
By Medi Samrat Published on 14 April 2023 8:15 PM ISTఐపీఎల్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బ్యాడ్ ఫామ్‌తో ఇబ్బంది పడుతోంది. రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్ లేని జట్టు.. తొలి నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. డేవిడ్ వార్నర్ సారథ్యంలోని జట్టు ఇప్పటి వరకు ఒక్క విజయం సాధించలేదు. శనివారం ఐదో మ్యాచ్‌ని ఆర్సీబీతో ఆడనుంది. అంతకు ముందు టీమ్‌కి ఓ గుడ్ న్యూస్ వచ్చింది. ఓ స్టార్ ప్లేయర్ తిరిగి జట్టులోకి రానున్నాడు. ఢిల్లీ తొలి హోమ్ మ్యాచ్ ఆడినప్పుడు రిషబ్ పంత్ స్టేడియానికి వచ్చాడు. ఇప్పుడు మరోసారి పంత్ టీమ్‌తో కనిపించాడు.
విశేషమేమిటంటే రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ శిక్షణ శిబిరంలో కనిపించాడు. ఢిల్లీ, ఆర్సీబీ శనివారం బెంగళూరులో పోటీపడతాయి. నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) అక్కడే ఉంది. ఇందులో రిషబ్ పంత్ పునరావాసం పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో అతను తన సహచరులను కలిసేందుకు ప్రాక్టీస్ శిబిరానికి వచ్చాడు. ఇక, తన వివాహానికి వారం రోజులు సెలవు తీసుకొని గత వారం స్వదేశానికి తిరిగి వచ్చిన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు.
అయితే.. మిచెల్ మార్ష్ ఈ సీజన్‌లోని ప్రారంభంలో రెండు మ్యాచ్‌లు ఆడాడు. లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో గోల్డెన్ డక్ ఔట్ అయ్యాడు. దీని తర్వాత అతను గుజరాత్ టైటాన్స్‌పై 4 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత పెళ్లి నిమిత్తం సెలవుపై వెళ్లాడు. ఐపీఎల్‌కు ముందు భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మార్ష్ బ్యాట్ ఏ విధంగా గర్జించాడో.. అదే విధంగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు బ్యాటింగ్ చేస్తాడని ఇప్పుడు భావిస్తున్నారు. అదే సమయంలో మరోసారి రిషబ్ పంత్ వెంట ఉండటం జట్టు నైతిక స్థైర్యాన్ని పెంచుతుంది.
మ్యాచ్‌కు ముందు.. పంత్ కూడా జట్టును ప్రోత్సహించాడు. అతను కోలుకోవడానికి సంబంధించిన అనేక విషయాలు చెప్పాడు. పంత్ మాట్లాడుతూ.. నేను బాగా కోలుకుంటున్నాను.. ప్రతి రోజు మెరుగుపడుతోంది. నేను ఎన్‌సీఏ కోసం ఇక్కడకు వచ్చాను. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూడా ఇక్కడ ఉంది. కాబట్టి నేను జట్టును కలవడానికి వచ్చాను. నేను నా సహచరులను కలిసి ఆనందించాను. నేను అన్నింటినీ కోల్పోయాను. నా హృదయం, ఆత్మ ఎల్లప్పుడూ డిల్లీ జట్టుతోనే అంటూ ఎమోషనల్‌గా మాట్లాడాడు.